Bigg Boss 5 Telugu Promo: మళ్లీ లీక్‌ చేసిన బిగ్‌బాస్‌, జెస్సీనే కెప్టెన్‌!

23 Sep, 2021 17:39 IST|Sakshi

Bigg Boss 5 Telugu: Jessie New Captain: బిగ్‌బాస్‌లో నెక్స్ట్‌ ఏం జరగబోతోంది? ఎవరు కెప్టెన్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? అన్న విషయాలను తెలుసుకోవాలని బుల్లితెర ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ లీకువీరులు అన్ని విషయాలను ముందుగానే నెట్టింట్లో పెట్టేస్తున్నారు. ఇది చాలదన్నట్లు స్వయంగా బిగ్‌బాసే వీరికి పోటీగా దిగినట్లు కనిపిస్తోంది. ఈ వారం ఎవరు కెప్టెన్‌ అయ్యారన్న విషయాన్ని ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పేశాడు.

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు ఫస్ట్‌ లవ్‌ గురించి చెప్తూ ఎమోషనల్‌ అయిన ప్రోమోలో మోడల్‌ జశ్వంత్‌ చేతికి కెప్టెన్సీ బాండ్‌ కనిపించింది. దీంతో జెస్సీ ఈ వారం కెప్టెన్‌ అయ్యాడని స్పష్టమవుతోంది. అయితే అంత పెద్ద విషయాన్ని అంత ఈజీగా లీక్‌ చేశాడేంటని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎడిటర్‌ నిద్రపోయినట్లున్నాడు అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. ఏదేమైనా జెస్సీ కెప్టెన్‌గా అవతరించి తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడని మరికొందరు మెచ్చుకుంటున్నారు.

A post shared by jessie (@jaswanth__jessie__)

A post shared by chusara_sirrr_eedi_memesu (@chusara_sirrr_eedi_memesu)

A post shared by BiggBoss 5Telugu (@telugubiggboss_season5)

మరిన్ని వార్తలు