-
ప్రపోజ్ చేసిన హీరోయిన్, గాల్లో తేలిపోయిన సన్నీ
Bigg Boss Telugu 5, BB Telugu Grand Finale Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు అందరినీ బిగ్‌బాస్ స్టేజీపైకి తీసుకొచ్చారు. రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్, రష్మిక మందన్నా, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, నాని, సాయిపల్లవి, కృతీశెట్టి, జగపతిబాబు.. వీళ్లేకాక మరెంతోమంది సింగర్లు, నటీనటులు, సెలబ్రిటీలు షోలో సందడి చేశారు. తారల తళుకుబెళుకులతో బిగ్‌బాస్ స్టేజీ మరింత కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఫైనలిస్ట్ సన్నీకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ ఆలియాభట్. తన ఫేవరెట్ హీరోయిన్ అయిన ఆమె కళ్లముందు స్టేజీపై కనిపించగానే సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు సన్నీ. అతడికి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఆలియా ఏకంగా సన్నీకి ఐ లవ్యూ చెప్పింది. ఇది కలా? నిజమా? అనుకుంటూ గాల్లో తేలిపోయిన సన్నీ పరవశంతో సరదాగా కిందపడిపోయాడు. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్‌తో ఐ లవ్యూ చెప్పించుకున్న సన్నీ ఈ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకోవడం ఖాయం. అటు సరయూ నాగార్జునను డేట్‌కు వెళ్దామని అడిగింది. దీనికి సరేనంటూ తలూపిన నాగ్.. గ్రాండ్ ఫినాలే అయిపోగానే డేట్‌కి వెళ్దామని పచ్చజెండా ఊపాడు. ఇక స్టార్ సెలబ్రిటీలు చేసిన హంగామా చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
Bigg boss 5 Telugu: బిగ్‌బాస్ స్టేజ్‌పై బాలయ్య డైలాగ్ చెప్పిన ఆలియాభట్
Bigg boss 5 Telugu Grand Finale Latest Promo Released: బిగ్‌బాస్ బిగ్‌బాస్ సీజన్-5 గ్రాండ్ ఫినాలే మరింత గ్రాండ్‌గా ముస్తాబయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 5మచ్ సర్ప్రైజ్లతో ఫినాలే ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఇందులో భాగంగా ప్రముఖ సినీ స్టార్స్‌ని రంగంలోకి దించారు. వరుస గెస్ట్‌లతో స్టేజ్ దద్దరిల్లిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి ప్రముఖ ప్రేమ జంట, 'బ్రహ్మస్త్ర' టీం నుంచి రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్లు సందడి చేశారు. అంతేకాకుండా ఆలియా.. బాలయ్య ఫేమస్ డైలాగ్ దబిడిదిబిడే.. అంటూ డైలాగ్ చెప్పడం విశేషం. 'ఆర్ఆర్ఆర్' నుంచి రాజమౌళి, 'శ్యామ్ సింగరాయ్' నుంచి నాని, కృతిశెట్టి, సాయి పల్లవి , 'పరంపర' మూవీ టీం నుంచి జగపతి బాబు, నవీన్‌చంద్ర బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. వీరితో పాటు పుష్ప నుంచి సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, రష్మిక ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. All set for #BiggBossTelugu5 Grand Finale evening with lots of surprises and Five much fun!#BBTeluguGrandFinale today at 6 PM on #StarMaa #BiggBossTelugu #FiveMuchFun pic.twitter.com/XETApXv0cN — starmaa (@StarMaa) December 19, 2021 -
డేటింగ్ యాప్‌లో ఓ అమ్మాయిని కలిశా: సన్నీ
Bigg Boss 5 Telugu, Five Time Fun Before The Grand Finale: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కథ రేపటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ముగియనుంది. ఈ కథలో ఎవరు హీరో అయ్యారు? కాదు కాదు ప్రేక్షకులు ఎవరిని హీరో చేశారన్న ప్రశ్నకు రేపు సమాధానం దొరకనుంది. దానికన్నా ముందు ఫైనలిస్టులను సరదాగా నవ్వించేందుకు ప్లాన్ చేశాడు బిగ్‌బాస్. గత సీజన్ల కంటెస్టెంట్లను పంపించి ప్రస్తుతం ఉన్న హౌస్‌మేట్స్‌ను ఓ ఆటాడుకోమన్నాడు. ఈ క్రమంలో రాహుల్ సిప్లిగంజ్, శివజ్యోతి ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చారు. బెలూన్లలోని గాలిని పీల్చుకుని దాన్ని బయటకు వదలకుండా మాట్లాడాలన్నారు. దీంతో కంటెస్టెంట్ల గొంతులు మారిపోవడంతో అందరూ పగలబడి నవ్వారు. ఇక అఖిల్ సార్థక్.. మీరెప్పుడైనా డేటింగ్ యాప్‌లో ఎవర్నైనా కలిశారా? అని అడిగాడు. దీనికి సన్నీ ఆన్సరిస్తూ.. 'ఒకసారి ఓ అమ్మాయిని కలిశాను. కానీ ఆమె నా ముచ్చట వదిలేసి తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్తూ పోయింది' అని చెప్పడంతో హౌస్మేట్స్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. మరి ఈ సరదా ఎపిసోడ్‌ను చూడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
టాస్క్‌లో ఫైట్.. సిరి రెచ్చగొట్టిందా? లేక సన్నీ రెచ్చిపోయాడా?
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ ఇంట్లో పాత టాస్కులనే మరోసారి ఆడిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాళ్లను కంటిన్యూగా ఆడించే టాస్క్‌లో సిరి, సన్నీ, షణ్ముఖ్ పాల్గొన్నారు. తాళ్లను పట్టుకుని ఎవరు ఎక్కువసేపు కదుపుతూ ఉంటే వారే గెలిచినట్లు లెక్క! ఈ ఆటలో సిరి ఎక్కువసేపు తాళ్లను కదపలేక అవుట్ అయింది. దీంతో పక్కకు వచ్చిన సిరి షణ్ను గెలవాలంటూ అతడిని ఎంకరేజ్ చేసింది. అక్కడిదాకా బానే ఉంది కానీ సన్నీ సరిగా ఆడట్లేదంటూ సరదాగా మాట్లాడింది. ఇది దృష్టిలో పెట్టుకున్న సన్నీ.. ఓడిపోయావ్ కదా అని ఆటపట్టించాడు. దీంతో చిర్రెత్తిపోయిన సిరి.. నువ్వూ ఓడిపోయావు.. షణ్ను ఒక్కడే గట్టిగా ఆడాడు అని రెచ్చగొట్టేలా మాట్లాడింది. నేను సరదాగా అన్నానని సన్నీ సర్ది చెప్పడానికి ప్రయత్నించగా ఓడిపోయావు అన్నది జోకా? అని సీరియస్ అయింది. అది మజాక్లో అన్నానని సన్నీ చెప్పగా సిరి మాత్రం నాతో జోకులెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చింది. అలా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవ చల్లారిందా? లేదా? అన్నది ఎపిసోడ్లో తేలనుంది. -
అప్పుడు ఇప్పుడు మానసే విన్నర్!!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. అప్పటిదాకా ఏం చేయాలో అటు కంటెస్టెంట్లకే కాదు, ఇటు బిగ్‌బాస్‌కు కూడా పాలు పోవట్లేదు. నిన్న అయితే హౌస్మేట్స్ అంతా చిన్నపిల్లల్లా మారిపోయి దాగుడుమూతలు ఆడుకున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్ కూడా వారిదారిలోకే వచ్చాడు. ఇంతకుముందు ఆడిన టాస్కులనే మళ్లీ మళ్లీ ఆడించాడు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. లేబుల్ లేదు మచ్చా గేమ్‌లో షణ్ముఖ్, మానస్ పోటీపడగా మానస్ గెలిచినట్లు సమాచారం. బెలూన్స్ టాస్క్‌లో షణ్ను గెలిచినట్లు లీకైంది. కొన్ని శబ్ధాలను ప్లే చేసి అవేంటో పసిగట్టి రాయాలన్న టాస్క్‌లో సన్నీ బెకబెక సౌండ్‌ను Frogకు బదులుగా Forg అని తప్పుగా రాయడంతో అందరూ పగలబడి నవ్వారు. సిరి అయితే ఏకంగా అది కప్ప కాదంటూ ఎలుక అని రాసింది. దీంతో కప్పకు, ఎలుకకు ఉన్న సంబంధాన్ని చెప్పమన్నాడు బిగ్‌బాస్. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఫన్నీ టాస్కులతో సరదాగా గడిచిపోనున్నట్లు కనిపిస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
భారత బాక్సర్ల పసిడి పంచ్
పుతిన్ ఐదోసారి ప్రమాణం
బంగ్లాదేశ్‌దే టి20 సిరీస్
శిక్షణలోనే సందేహాలు నివృత్తి చేసుకోవాలి
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ఎస్సీ వర్గీకరణ మోదీకే సాధ్యం
మీ బిడ్డను ఎంపీగా ఆదరించండి
అభివృద్ధిని అడ్డుకునే బీజేపీని ఓడించండి
ఇంటర్ ఫెయిల్ అయ్యామని..
‘దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ’
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement