Bigg Boss 5 Telugu: రవి, శ్రీరామ్‌, నటరాజ్‌ బాగా క్లోజ్‌.. అయినా నా సపోర్ట్‌ ఆమెకే: నాగబాబు

8 Sep, 2021 15:24 IST|Sakshi

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి మొదలైంది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల కంటే ఎక్కువ వినోదాన్ని అందించే ప్లాన్‌లో ఉన్నాడు బిగ్‌బాస్‌. ఎప్పుడూ లేనంతగా ఈ సారి ఏకంగా 19 మందిని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి తీసుకొచ్చారు. సాధారణంగా బిగ్‌బాస్‌ ఇంట్లో, షో మొదలై వారం రోజులు గడిచాక గొడవలు మొదలైతాయి. కానీ ఈ సారి మాత్రం తొలి రోజు నుంచి మాటల యుద్దం మొదలైంది. జెస్సీ మీద యానీ మాస్టర్‌ ఫైర్‌ అవ్వడం, ఎందుకంత హైపర్‌ అవుతున్నావని కాజల్‌కు లహరి చురకలు అంటించడం చూస్తుంటే.. మున్ముందు గొడవలకు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  

బిగ్‌బాస్‌ ఇంట్లో వాళ్లు అంత రచ్చ చేస్తుంటే..  బయట వారి అభిమానులు కూడా ‘సోషల్‌’ దాడి చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన కంటెస్టెంట్స్‌తో గొడవకి దిగిన వారిపై విమర్శలు చేస్తున్నారు. ఎవరికి వారు తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్‌కి మద్దతు తెలుపుతూ సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. 
(చదవండి: బిగ్‌బాస్‌: తమ్ముడి మరణం, రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ)

ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా బిగ్‌బాస్‌పై స్పందించారు. బిగ్‌బాస్‌-5లో యాంకర్‌ రవి, యానీ మాస్టర్‌, సింగర్‌ శ్రీరామ్‌, ప్రియ, నటరాజ్‌ మాస్టర్‌తో పాటు చాలా మంది పాల్గొన్నారని, వీరంతా తనకు ఒకెత్తు అయితే.. ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌ మరో ఎత్తు అన్నారు. తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఉంటుందన్నారు. ప్రియాంక అబ్బాయిగా (సాయి) ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్‌ అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. ప్రియాంక బిగ్‌బాస్‌లోకి వెళ్లిందనే విషయం చాలా సంతోషానిచ్చిందన్నారు. ట్రాన్స్‌ జెండర్‌గా మారాక ప్రియాంక చాలా ఇబ్బంది పడిందని, అవకాశాలు రాని సమయంలో తాను ఓ షోలోకి తీసుకొని సాయం చేశానని గుర్తు చేశారు. ప్రియాంక విన్నర్‌ అవుతుందా లేదా తనకు తెలియదని కానీ, తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఇస్తానని తేల్చి చెప్పారు. ఇక ప్రియాంక విషయానికొస్తే.. ఓ కామెడీ షోలో లేడీ గెటప్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియాంక అసలు పేరు సాయి తేజ. ట్రాన్స్‌ జెండర్‌గా మారాక ప్రియాంక సింగ్‌ అని పేరు మార్చుకున్నారు. 

మరిన్ని వార్తలు