Bigg Boss 5 Telugu: ఫస్ట్‌ వీక్‌ నామినేట్‌ అయిన ఆ ఆరుగురు!

6 Sep, 2021 23:50 IST|Sakshi

Bigg Boss 5 Telugu 1st Week Nominations: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో తొలి రోజే కంటెస్టెంట్లకు నిద్ర లేకుండా చేశాడు లోబో. తన గురకతో హౌస్‌మేట్స్‌ అందరినీ నిద్రకు దూరం చేశాడు. అతడి గురకను ఆపడానికి రవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరోవైపు అదే రాత్రి తమకు బోర్‌ కొడుతోందంటూ దొంగతనానికి పూనుకున్నారు సిరి హన్మంత్‌, జెస్సీ. కంటెస్టెంట్ల వస్తువులను దాచేసి తర్వాత నిమ్మకు నీరెత్తనట్లు ఊరకుండిపోయారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి ఆరుగురు నామినేట్‌ అయ్యారు. ఆ ఆరుగు ఎవరు? తొలి రోజు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం జరిగిందో చదివేయండి.

దొంగతనం చేశామని ఒప్పుకున్న సిరి
ఇక తర్వాతి రోజును ఉరకలెత్తించే డ్యాన్స్‌తో ఉల్లాసంగా, ఉత్సాహంగా మొదలుపెట్టారు కంటెస్టెంట్లు. ఆ తర్వాత ఇయర్‌ రింగ్స్‌ పోయాయని ఒకరు, చెప్పులు పోయాయని మరొకరు గోల పెట్టినా అసలు దొంగలు మాత్రం చీమ కుట్టనట్లు ఉండిపోయారు. అయితే యాంకర్‌ రవి మాత్రం జెస్సీనే దొంగ అని ముందుగానే పసిగట్టడంతో సిరి తామే దొంగలమని ఒప్పుకోక తప్పుకోలేదు.

మూడున్నరేళ్ల నుంచి మోసం చేస్తున్నా..
ఇక ప్రియాంక సింగ్‌ తాను అతడు నుంచి అమ్మాయిగా మారేందుకు చేసుకున్న ఆపరేషన్‌ గురించి ఆర్జే కాజల్‌తో మాట్లాడింది. ఈ విషయంలో మూడున్నరేళ్ల నుంచి మా నాన్నను మోసం చేస్తున్నానని చెప్తూ ఎమోషనల్‌ అయింది. ఒకసారి తను నన్ను ముట్టుకుని గడ్డాలు, మీసాలు ఏవని అడిగితే లేడీ గెటప్‌ కోసం తీసేయించుకున్నానని అబద్ధం చెప్పానంటూ కంటతడి పెట్టుకుంది. దీంతో ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చింది కాజల్‌.

చెత్తకుండీలో కంటెస్టెంట్ల ఫొటోలు
అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లో తొలివారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా కంటెస్టెంట్లు నామినేట్‌ చేయాలనుకున్నవారి ఫొటోలు ఉన్న చెత్త కవర్లను చెత్తకుండీలో వేయాలి. ముందుగా సింగర్‌ శ్రీరామచంద్ర.. మానస్‌, జెస్సీలను నామినేట్‌ చేశాడు. సరయూ.. ఆర్జే కాజల్‌, యాంకర్‌ రవిని; శ్వేత వర్మ.. హమీదా, నటరాజ్‌ మాస్టర్‌ను, జెస్సీ.. విశ్వ, హమీదాను; ఉమాదేవి.. కాజల్‌, జెస్సీలను నామినేట్‌ చేశారు.

చదవండి: Bigg Boss 5 Telugu: నాగ్‌ పారితోషికం ఎంతో తెలుసా?

యాంకర్‌ రవికి కౌంటరిచ్చిన నటరాజ్‌ మాస్టర్‌
ఇక బిహేవియర్‌ నచ్చలేదని జెస్సీని, అందరితో క్లోజ్‌ అవ్వాలంటూ మానస్‌ను నామినేట్‌ చేశాడు విశ్వ. తనకు కాంపిటీషన్‌గా వస్తుందని సిరిని, కోపం తగ్గించుకోవాలంటూ జెస్సీని నామినేట్‌ చేసింది యానీ మాస్టర్‌. బయట ఉన్నట్లుగా హౌస్‌లో లేడని నటరాజ్‌ మాస్టర్‌ను, రిలాక్స్‌గా ఉంటున్నాడని మానస్‌ను నామినేట్‌ చేశాడు రవి. అయితే తనకు నటించడం రాదని రవికి గట్టి కౌంటరిస్తూనే అతడిని నామినేట్‌ చేశాడు నటరాజ్‌ మాస్టర్‌. అమాయకత్వంతో ఈ హౌస్‌లో ఉండలేవంటూ జెస్సీని నామినేట్‌ చేశాడు. ఫస్ట్‌ వీక్‌లోనే అందరూ నామినేట్‌ చేస్తుండటం, అందులోనూ వాళ్లు చెప్పే కారణాలను జీర్ణించుకోలేకపోయిన జెస్సీ అందరిముందే ఏడ్చేశాడు.

కళ్లల్లోకి కళ్లు పెట్టి చూశాడని రవిని నామినేట్‌ చేసిన లోబో
రూడ్‌గా మాట్లాడుతుందని లహరిని, తనను కామెంట్‌ చేశాడని జెస్సీని నామినేట్‌ చేసింది హమీదా. తనకు టాస్క్‌లు ఆడమని చెప్పడం నచ్చలేదని సన్నీని, ఎక్కువగా జోక్యం చేసుకోవడం నచ్చదని లోబోను నామినేట్‌ చేశాడు షణ్ముఖ్‌. యాటిట్యూడ్‌ చూపించిందని ప్రియను, యాపిల్‌ తినేటప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ యాటిట్యూడ్‌ చూపించాడని రవిని నామినేట్‌ చేశాడు లోబో.

మొదటి వారం నామినేట్‌ అయిన ఆరుగురు
మానస్‌.. విశ్వ, సరయూ; సిరి.. హమీదా, ప్రియను; సన్నీ.. షణ్ముఖ్‌, లహరిని; ప్రియాంక సింగ్‌.. షణ్ముఖ్‌, హమీదాలను; ప్రియ.. సిరి, కాజల్‌ను; మానస్‌.. విశ్వ, సరయూలను; కాజల్‌.. సరయూ, ఉమాదేవిని; లహరి.. హమీదా, కాజల్‌ను నామినేట్‌ చేశారు. దీంతో మొదటివారం నామినేషన్‌ ప్రక్రియ పూర్తైంది. ఎక్కువగా ఓట్లు పడిన రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు ఈవారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కోసం నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ వెల్లడించాడు. మరి వీరిలో ఎలిమినేషన్‌ గండం గట్టెక్కేది ఎవరనేది చూడాలి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు