Bigg Boss 7 Telugu: దత్తపుత్రిక ఖాతాలో మరో కంటెస్టెంట్‌ బలి.. డాక్టర్‌ బాబు గుడ్‌బై!

2 Dec, 2023 18:46 IST|Sakshi

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్‌ బుల్‌ పిట్టా... ఈ పాట పాడుకునే సమయం వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్‌ వల్ల అర్జున్‌ మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. ఈసారి ఈయన జెండా ఎత్తేయడం పక్కా అనుకున్నారంతా! కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన సత్తా ఏంటో చూపించాడు అర్జున్‌. టికెట్‌ టు ఫినాలే రేసులో అందరినీ వెనక్కు నెడుతూ, ఎవరి సపోర్ట్‌ లేకుండా సింగిల్‌గా ఆడి ఫినాలే అస్త్ర గెలిచాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ అయితేనే కదా టాప్‌ 5లో చోటు దక్కించుకునేది అని అందరూ డౌట్‌ పడ్డారు.

కానీ ఈ వారం మొదట సేవ్‌ అయింది అర్జునే! నాగార్జున ఈ సీజన్‌లో ఫస్ట్‌ ఫైనలిస్ట్‌గా అర్జున్‌ను ప్రకటిస్తూ అతడిని సేవ్‌ చేశాడు. దీంతో ఎలిమినేషన్‌ గండం గౌతమ్‌, శోభల మెడకు చుట్టుకుంది. కానీ శోభ కోసం ఎవరినైనా బలి చేసేందుకు బిగ్‌బాస్‌ రెడీ.. కాబట్టి ఆమెకు బదులుగా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ను పంపించే ప్లాన్‌ చేశారట! టాప్‌5లో ఉండేందుకు అర్హత ఉన్న గౌతమ్‌ కృష్ణను ఎలిమినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇది చూసిన డాక్టర్‌ బాబు అభిమానులు.. అన్‌ఫెయిర్‌ బిగ్‌బాస్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఆర్తనాదాలు చేస్తున్నారు.

చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో నో ట్రీట్‌మెంట్‌

మరిన్ని వార్తలు