ట్రాఫిక్‌ తెచ్చిన తంటా.. రోడ్డుపై డిష్యుం డిష్యుం! వీడియో వైరల్‌

10 Nov, 2023 22:03 IST|Sakshi

అత్యంత రద్దీ ఉండే మెట్రో నగరాల్లో బెంగళూరు ఒకటి. దేశ ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న ఆ నగరంలో ట్రాఫిక్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా బెంగళూరు రోడ్డుపై ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద జరిగిన జగడం అంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో 'ఘర్ కే కాలేష్' అనే హ్యాండిల్‌పై ఈ వీడియో అప్‌లోడ్ చేశారు. ఇందులో రోడ్డుపై ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. రెడ్ సిగ్నల్‌ వద్ద ఆగిపోయిన ట్రాఫిక్ మధ్య ఇద్దరు వ్యక్తులు మరొక వ్యక్తి పిడిగుద్దులు కురిపించారు. 

గ్రీన్‌ సిగ్నల్ పడగానే వాళ్లు అలాగే కొట్టుకుంటూ పక్కకు వెళ్లిపోయారు. వీరి జగడాన్ని ఓ వ్యక్తి వీడియో తీశారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోకు పెద్ద సంఖ్యలో లైక్స్‌, వ్యూస్‌ వచ్చాయి. నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు ఇది అద్దంపడుతోందంటూ ఈ వీడియోను చూసిన యూజర్లు కామెంట్లు పెట్టారు.

మరిన్ని వార్తలు