Bigg Boss 7 Day 74 Highlights: శివాజీ నిజస్వరూపం ఇది.. తనదాకా వచ్చేసరికి ప్రశాంత్‌ని కూడా వదల్లేదు!

16 Nov, 2023 23:36 IST|Sakshi

బిగ్‌బాస్ షోలో శివాజీ బాగా ఆడుతున్నాడా? అంటే కచ్చితంగా కాదు. షో నిర్వహకులు శివాజీ మంచోడు అనే ఇమేజ్ క్రియేట్ చేశారు. అందుకే మీకు అలా అనిపిస్తోంది. ఇప్పుడు ఓ గేమ్ సందర్భంగా శివాజీ నిజస్వరూపం మరోసారి బయటపడింది. తనదాకా వచ్చేసరికి తన శిష్యుడు ప్రశాంత్‌తోనే గొడవపెట్టుకున్నాడు. సంచాలక్ శోభా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే ఎక్కడలేని అతి చేశాడు. ఇంతకీ గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 74 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

బిగ్‌బాస్ ఫిట్టింగ్ యవర్‌కి ప్లస్
అర్జున్ ఎవిక్షన్ పాస్ గెలుచుకోవడంతో బుధవారం ఎపిసోడ్ ముగిసింది. అర్జున్‌, తన ఎవిక్షన్ పాస్ డిఫెండ్ చేసుకోవాలని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో టాప్-5లో ఒకరితో 'షేక్ బేబీ షేక్' అనే గేమ్ ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. యవర్‌ని ఎంచుకోగా.. అర్జున్‌ని అతడు ఓడించేసి ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దీని తర్వాత 'స్కూటర్ పై సవారీ' పోటీలో తెలివిగా ప్రశాంత్‌ని ఎంచుకున్నాడు. ఫిజికల్ పరంగా స్ట‍్రాంగ్ అయిన ప్రశాంత్.. నంబర్స్ గుర్తుంచుకునే ఈ టాస్కులో తేలిపోయాడు. దీంతో మళ్లీ యావర్ ఎవిక్షన్ పాస్ డిఫెండ్ చేసుకున్నాడు. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: ఆరోగ్యంతో చెలగాటం.. శోభాశెట్టికి అలాంటి పరిస్థితి!)

శోభాశెట్టి వాంతులు
ఇక ఎవిక్షన్ పాస్ కాపాడుకునేందుకు 'ఐ లవ్ బర్గర్' అనే టాస్క్ పెట్టగా.. యావర్, శోభాశెట్టిని తన ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు. అయితే ఆమె అప్పుడే భోజనం చేసి పోటీలో పాల్గొనడం వల్ల బర్గర్ అస్సలు తినలేకపోయింది. బాత్రూంలోకి వెళ్లి వాంతి చేసుకుంది. ఇక్కడ కూడా అదృష్టంతో పాటు తెలివి కలిసొచ్చేసరికి యావర్ విజయం సాధించాడు. అయితే ఈ పోటీలో ఓడిపోయిన తర్వాత శోభాశెట్టి తెగ బాధపడిపోయింది. 'ఈ వారం నాకు ఇదొక్కడే గేమ్, అది చూడగానే నాకు కాన్ఫిడెన్స్ పోయింది. అప్పుడే తిన్నా, ఎంతసేపు కూర్చున్నా, తినకుండా ఉన్నా బాగుండేది' అని ప్రియాంకతో చెబుతూ బాధపడింది.

ప్రశాంత్‌పై అరిచిన శివాజీ
ఎవిక్షన్ పాస్ కాపాడుకునేందుకు చివరగా 'టేక్ ఏ బౌ' అని పోటీ పెట్టాడు. ఇందులో యావర్, మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్ శివాజీ, ప్రియాంకతో ఒకేసారి గేమ్ ఆడాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే ఈ గేమ్‌లో తొలుత ప్రియాంక బాల్స్ కిందపడిపోవడంతో ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇక ప్రశాంత్ డిస్ట్రబ్ చేస్తున్నాడని శివాజీ బాల్స్ విసిరికొట్టి మరీ గేమ్ నుంచి బయటకొచ్చేశాడు. ఇక బజర్ మోగకముందే యవర్ బాల్స్ కూడా కిందపడిపోయాయి. ఇక ఈ గేమ్ జరుగుతున్న టైంలో గేమ్స్ సరిగ్గా ఆడండని ప్రశాంత్ అందరితో చెప్పాడు. దానికి డిస్ట్రబ్ అయిన శివాజీ.. ప్రశాంత్‌పై ఓ రేంజులో రెచ్చిపోయాడు. 'నువ్వు మాట్లాడకు.. నువ్వు ఎక్కువ డిస్ట్రబ్ చేస్తున్నావ్ అందరినీ' అని శివాజీ తన కోపన్నంతా బయటపెట్టాడు. మరోవైపు గేమ్ అవుతున్న సమయంలో.. శివాజీ అదే పనిగా బాల్స్‌ని చేతిలో హోల్డ్ చేశాడు. దీంతో స్వయంగా బిగ్‌బాస్ కూడా.. బాల్స్ అదేపనిగా పట్టుకుంటున్నారు శివాజీ అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ శివాజీ ఫౌల్ గేమ్ ఆడాడని బయటపడింది.

(ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్)

శోభాతో పనికిరాని గొడవ
ఇక గేమ్ పూర్తయిన తర్వాత శోభా-ప్రశాంత్ ఏదో చెప్పాలని అనుకుంటూ ఉండగా.. బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. 'నియమాల ప్రకారం ఎవరు గెలిచారో చెప్పండి' అని అన్నాడు. దీంతో సంచాలకులుగా వ్యవహరించిన శోభా-ప్రశాంత్ అసలేం జరిగిందా అని మాట్లాడుకుంటూ ఉండగా.. పానకంలో పుడకలా శివాజీ మధ్యలో ఎంటరయ్యాడు. అటు ఇటు అదేపనిగా తిరుగుతూ శోభాతో.. 'మీ ఇష్టం, మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి' అని కావాలనే ఇరిటేట్ చేశాడు. కానీ శోభా చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ.. అసలెందుకు అరుస్తున్నారు అన్నా మీరు' అని శివాజీని అడిగింది. దీంతో కావాలనే గట్టిగట్టిగా అరుస్తూ శోభాని రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు. తనకే ఎవిక్షన్ పాస్ ఇచ్చేయాలి, లేకపోతో ఒప్పుకోను అన్నంత రేంజులో హడావుడి చేశాడు. 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. శివాజీ ఆడింది ఫౌల్ గేమ్. మళ్లీ సంచాలక్ శోభాశెట్టి ఎవరు కరెక్ట్ గా ఆడారా అని డిస్కస్ చేస్తుండగానే ఆమె నిర్ణయాన్ని తారుమారు చేసేయాల్సిందే అనేలా శివాజీ చాలా ఇరిటేట్ చేశాడు. దీనిబట్టి శివాజీ.. బిగ్ బాస్ పరువు తీయడానికి తయారయ్యాడ్రా బాబు అనిపించింది. అలానే తనదాకా వచ్చేసరికి తన గ్రూప్ కే చెందిన ప్రశాంత్ ని కూడా వదల్లేదు. దీంతో శివాజీ నిజస్వరూపం ఇదీ అని అందరికీ అర్థమైంది. అలా గురవారం ఎపిసోడ్ పూర్తయింది. 

(ఇదీ చదవండి: హీరో మహేశ్‌బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!)

మరిన్ని వార్తలు