Bigg Boss 7 Day 76 Highlights: పాపం నాగార్జున.. బూతులు మాట్లాడితే వార్నింగ్ ఇవ్వలేక చివరకేమో అలా!

18 Nov, 2023 23:51 IST|Sakshi

బిగ్ బాస్ హౌసులో భజన ఎక్కువైంది. శివాజీ ఏం చేసినా, ఏం మాట్లాడినా అతడు చెప్పిన సమాధానాలు విని తలుపుతున్నారు. పాపం హోస్ట్ నాగార్జున కూడా ఏం చేయలేకపోతున్నాడు. షోకు కొన్ని నియమాలు అని ఉంటాయి. శివాజీ మీద ప్రేమ ఎక్కువై, అవి ఉన్నట్లు కూడా మరిచిపోతున్నాడు. బూతులు మాట్లాడినందుకు వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి బతిమాలాడుకుంటున్నారు. సరే ఇంతకీ శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 76 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!)

శివాజీ ఒకటే భజన
ప్రియాంక.. బిగ్‌బాస్ హౌసుకి కొత్త కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. వీకెండ్ కదా.. నాగార్జున రావడంతో శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. శుక్రవారం జరిగినదంతా చూసిన హోస్ట్ నాగ్.. ఇంటి సభ్యుల్ని పలకరించాడు. ఈవారం అసలేం జరిగిందనే విషయాన్ని శివాజీతో మొదలుపెట్టాడు. అంతా బానే ఉంది గానీ ఓ విషయం మాత్రం నచ్చట్లేదు శివాజీ అని నాగ్ అనగానే.. బూతులా బాబుగారు! వాటిని కావాలని అనలేదని, అలా వచ్చేశాయని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. అసలు అమర్‌ని పిచ్చి పోహో అని ఎందుకన్నావ్ శివాజీ అనగానే.. ఇంట‍్లో పోహా చేసుకుంటాం కదా బాబుగారు అందుకే అలా అన్నానని ఓ పనికిమాలిన లాజిక్ చెప్పాడు. అమర్‌దీప్ ఓ పిచ్చోడు. వాటిని నేను అస్సలు పట్టించుకోలేదని అన్నాడు. 

శివాజీని బతిమాలాడిన నాగ్
పిచ్చి నాయాల్ల, పిచ్చి పోహా, ఎర్రి పోహా.. ఇవన్నీ హౌసులో వాడే పదాలా? అని నాగ్, శివాజీపై సీరియస్ అయినట్లు నటించాడు. ఈ విషయంలో నీ అనుభవం ఏమైంది? ఈ విషయంలో నీ సహనం ఏమైంది? ఈ విషయంలో నీ సమర్థత ఏమైంది? అని నాగ్ అడిగాడు తప్పితే.. నియమాల ప్రకారం బిగ్‌బాస్‌లో బూతులు మాట్లాడుకూడదు. అలాంటి అర్థం వచ్చేలా మాట్లాడిన పనిష్మెంట్ ఇవ్వాలనే సోయి లేకుండా పోయింది. చూసే ప్రేక్షకుల్లో చాలామందికి వాటి అర్థాలేంటో, అవి ఎంత పెద్ద బూతులనేది తెలుసు. కానీ బిగ్‌బాస్ ఆర్గనైజర్స్, హోస్ట్ నాగార్జునకు తెలియకుండా పోయింది. దీంతో ఎప్పటిలానే ఆ టాపిక్‪‌ని నైస్‌గా సైడ్ చేసేసి, శివాజీకి కనీసం వార్నింగ్-పనిష్మెంట్ లాంటివి ఏం ఇవ్వకుండానే మిగతా విషయాలపై పడ్డారు.

(ఇదీ చదవండి: బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. నో ఎలిమినేషన్‌)

నో కెప్టెన్సీ టాస్క్
ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అమర్ ప్రవర్తన గురించి నాగ్ అడిగాడు. దీంతో హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో ఎలాగైనా సరే కెప్టెన్ కావాలనే అలా చేశానని అమర్ ఏదో సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సందర్భంలో నాగ్ ఓ విషయమై ట్విస్ట్ ఇచ్చాడు. వచ్చే వారం మాత్రమే కెప్టెన్సీ టాస్క్ ఉంటుందని, మిగిలిన మూడు వారాల్లో కెప్టెన్సీ టాస్క్ ఏం ఉండదని బాంబ్ పేల్చాడు.

రతికకి క్లాస్- ఆ పదాలు బ్యాన్
రతికని నిలబట్టి నాగ్ కడిగేశాడు. దేంట్లో గెలిచావ్ చెప్పు రతిక అని నాగార్జున సీరియస్ అయ్యాడు. ఈ ప్రశ్న అడగానికి ముందు ఆమె ఫొటో పెట్టి మూడు బాటిల్స్ పగలగొట్టాడు. ఈవారం నామినేషన్స్ మాట్లాడిన కొన్ని మాటల్ని బ్యాన్ చేస్తున్నట్లు నాగ్ చెప్పుకొచ్చాడు. రతిక ఎక్కువగా చెప్పే.. 'వచ్చే వారం నుంచి నేనేంటో చూపిస్తాను', 'నేను ఇక్కడి నుంచి ఆడతాను' అనే వాటితో పాటు శివాజీ ఎక్కువగా చెప్పే 'జనాలు చూస్తున్నారు' అనే వాక్యంతో పాటు సీరియల్ బ్యాచ్ ఎక్కువగా ఉపయోగించే 'పోట్రే చేస్తున్నారు' అనే ఈ వాక్యాలన్నీ ఈరోజు నుంచి హౌసులో బ్యాన్ చేస్తున్నానని నాగ్ చెప్పాడు. అయితే ఈ పనేదో ముందే చేసుంటే బాగుండేది. ఇప్పుడు చేసి ఏం ఉపయోగం అనిపించింది. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?)

ఎవిక్షన్ పాస్ రిటర్న్
ఇక ప్రశాంత్ గురించి మాట్లాడిన నాగ్.. అసలు ఈ వారం ఏమైనా గేమ్ ఆడావా నువ్వు అని అడిగాడు. దీంతో తల అడ్డంగా ఊపుతూ ప్రశాంత్ సమాధానం చెప్పలేకపోయాడు. ఫ్యామిలీ వీక్‌లో అందరూ వచ్చిన నీ పేరు చెప్పేసరికి రిలాక్స్ అయిపోయావా కదా అని కౌంటర్స్ వేశాడు.  అలానే ఎవిక్షన్ పాస్ దక్కించుకునే విషయంలో యావర్ ఫౌల్ గేమ్ ఆడినట్లు వీడియోలతో సహా నాగ్ బయటపెట్టాడు. దీంతో యావర్.. అది తనకు వద్దని తిరిగిచ్చేశాడు. 

అయితే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది. పెద్దాయన అనే ముసుగులో నీతులు చెప్పే శివాజీ.. తాను మాత్రం నీతులు పాటించాడు. బూతుల్ని నేరుగా మాట్లాడితే ప్రాబ్లమ్ అవుతుందని, పదాలు మార్చి మరి.. తెలివిలేని అమర్‌ని అంటాడు. వీకెండ్ లో వచ్చే నాగార్జున.. పనిష్మెంట్ ఇచ్చి బుద్ది చెప్పాల్సింది పోయి శివాజీ చెప్పిన దానికి తలూపేస్తాడు. దీనిబట్టి చూస్తే బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ ఎప్పుడు మారతారో అనే సందేహం వస్తోంది. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు)

మరిన్ని వార్తలు