Bigg Boss 7 Day 83 Highlights: ఇంట్రెస్టింగ్‌గా వీకెండ్ ఎపిసోడ్.. హాట్ బ్యూటీ అశ్విని ఎలిమినేట్

25 Nov, 2023 23:29 IST|Sakshi

బిగ్‌బాస్ షోలో కాస్తోకూస్తో ఆసక్తిగా ఉండేవి అంటే నామినేషన్స్, వీకెండ్ ఎపిసోడ్ మాత్రమే. ఈ సీజన్‌లో నామినేషన్స్ తప్ప వీకెండ్ ఎపిసోడ్స్ బోరింగ్‌గా సాగుతూ వచ్చాయి. ఇన్నాళ్లకు ఓ వీకెండ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. హోస్ట్ నాగార్జున అయితే ఒక్కొక్కరిని నిలబెట్టి కడిగేశాడు. అలానే చాలామంది ఊహించినట్లే అశ్విని ఎలిమినేట్ అయిపోయింది. ఇంతకీ శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 83 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

శివాజీ భుజం డ్రామా
కెప్టెన్సీ టాస్క్‌లో తనకు అన్యాయం జరగడంపై అమర్ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరొచ్చి చెప్పినా సరే ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాడు. ఇక శివాజీని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్‌బాస్.. భుజం నొప్పి తగ్గిందా? అంతా ఓకేనా అని ఆరా తీశాడు. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం కోలుకుంటున్నారని, రాబోయే వారాల్లో టఫ్ గేమ్స్ ఉంటాయని చెప్పాడు. హౌసులో ఉండాలనుకుంటున్నారా? బయటకొచ్చేయాలనుకుంటున్నారా? అని బిగ్‌బాస్ అడగ్గా.. కాస్త టైమ్ ఇస్తే ఆలోచించి చెబుతానని అన్నాడు. అయితే ఇకపై హౌసులో మీ గాయానికి ఎలాంటి ప్రమాదం జరిగినా బాధ్యత అంతా మీదే అని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చాడు. తొలుత కొనసాగుతానని చెప్పిన శివాజీ.. కాసేపటి తర్వాత మనసు మార్చుకుని.. బయటకెళ్లిపోతా అని అన్నాడు.

(ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?)

ధైర్యం చెప్పిన నాగ్
ఇదంతా జరిగిన తర్వాత హోస్ట్ నాగార్జున కూడా కన్ఫెషన్ రూంకి పిలిచి మరీ శివాజీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు. 100 శాతం ఎఫర్ట్ పెట్టలేనప్పుడు కప్ ఆశించడం కరెక్ట్ కాదని, అందుకే వెళ్లిపోతానని అన్నట్లు శివాజీ చెప్పాడు. ఎక్కువ ఆలోచించొద్దు, భయమనేది వద్దని నాగ్ కాస్త సర్దిచెప్పేసరికి శివాజీ అంగీకరించాడు. ఇకపై ఏం జరిగినా బాధ్యత తనదేనని చెప్పాడు. దీనిబట్టి చూస్తే.. ఒకవేళ గాయం ఏమైనా తిరగబెడితే మాత్రం ఎప్పుడైనా సరే శివాజీ హౌస్ నుంచి బయటకెళ్లిపోయే ఛాన్స్ ఉంది. మరి చివరి వారం వరకు ఉంటాడా లేదా అనేది అతడి గాయం తీవ్రత బట్టి ఆధారపడి ఉంటుంది.

అమర్ నిజస్వరూపం
ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న ప్రశాంత్‌ని నాగార్జున మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అశ్విని నిలబెట్టి.. డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకుంటావా? కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అని అని నాగ్ సీరియస్ అయ్యాడు. అనంతరం అమర్‌తో మాట్లాడాడు. గతంలో ప్రశాంత్ ఏడుస్తుంటే, దాన్ని యాక్టింగ్ అని అమర్ అందులో అన్నట్లు ఉంది. తాజాగా కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అమర్ ఏడవటాన్ని లింకప్ చేసి నాగ్ ప్రశ్నించాడు. వేరేవాళ్లు ఏడిస్తే, వాళ్లది యాక్టింగ్ అని నువ్వు అన్నావ్.. ఇప్పుడేమో నువ్వు చేసింది యాక్టింగా? అని నాగ్ అడిగేసరికి.. నా వరకు వస్తే గానీ తెలియలేదు అని అమర్ తన అభిప్రాయం చెప్పాడు. అలానే గత వారం కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా తన ఏడిచింది స్ట్రాటజీ అని శివాజీతో మాట్లాడుతూ అమర్ ఓ సందర్భంలో చెప్పాడు. ఆ వీడియోని కూడా స్క్రీన్‌పై ప్లే చేసిన నాగ్.. ఇదేంటని అడిగాడు. అమర్ ఏదో చెప్పబోతుంటే.. నీ విషయంలో ఏది యాక్టింగ్? ఏది జెన్యూనిటీ? ఏది స్ట్రాటజీ? అనేది మాకే అర్థం కావట్లేదని నాగ్ అసహనం వ్యక్తం చేశాడు. ఏదైనా సరే కెప్టెన్సీ కంటే కప్ ముఖ్యం అని చెప్పి అమర్‌ని నాగ్ శాంతింపజేశాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!)

శివాజీ వాదన
శివాజీ.. కెప్టెన్సీ విషయమై అమర్‌కి మాటిస్తున్నా అన్నావ్? మాట కోసం చచ్చిపోతాను అన్నావ్? ఎందుకు మాట మార్చావ్ అని నాగ్, శివాజీని అడిగాడు. దానికి శివాజీ ఏదేదో చెప్పుకొచ్చాడు. అమర్ కెప్టెన్ అయితే తన డిప్యూటీలుగా ప్రియాంక-శోభాని పెట్టుకుంటానన్నాడని అది తనకు నచ్చలేదని, అలానే ప్రియాంక కెప్టెన్సీలో చాలా విషయాలు కరెక్ట్‌గా జరగలేదని నాగ్ ముందే చెప్పాడు. మధ్యలో లేచిన ప్రియాంక.. నాగ్ ముందే శివాజీతో వాదన పెట్టుకుంది. ఇదంతా కూడా చిన్నపిల్లలా యవ్వారంలా అనిపించింది తప్పితే డీసెంట్‌గా అయితే లేదు. అలానే 'హత్య టాస్క్' సందర్భంగా శోభాకి సీక్రెట్ చెప్పి, ఆమె డెడ్ అవ్వకుండా ప్రియాంక కాపాడింది. ఈ వీడియోని చూపించిన నాగ్.. ప్రియాంకని కూడా ఓ రేంజులో ఇ‍చ్చిపడేశాడు. మీ ముగ్గురూ(అమర్-ప్రియాంక-శోభా).. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారని సీరియస్ అయ్యాడు. 

అశ్విని ఎలిమినేట్
చివర్లో యావర్‌ని కూడా నిలబెట్టి కెప్టెన్ అంటే హౌస్ మొత్తానికి కెప్టెన్ అని, ఆమెతో నామినేషన్స్ సందర్భంగా ప్రవర్తించిన తీరు సరికాదని చెప్పిన నాగార్జున.. యావర్‌తో ప్రియాంకకు సారీ చెప్పించాడు. కట్ చేస్తే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గుర్తుచేసిన నాగ్.. గన్‌తో పేల్చడం అనేది పెట్టి అశ్విని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే ప్రశాంత్.. నువ్వేమైనా ఎవిక్షన్ పాస్ ఇప్పుడు ఉపయోగిస్తావా అని అడగ్గా.. 14వ వారం వేరొకరి కోసం ఉపయోగిస్తానని ప్రశాంత్, నాగార్జునకు మాటిచ్చేశాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరంటే?)

మరిన్ని వార్తలు