Bigg Boss 7 Day 91 Highlights: గౌతమ్ ఎలిమినేట్.. అదే అసలు కారణమా?

3 Dec, 2023 23:30 IST|Sakshi

బిగ్‌బాస్ 7 గురించి హోస్ట్ నాగార్జున ఏమో గొప్పలు చెబుతున్నాడు. రియాలిటీలో మాత్రం అస్సలు అలా లేదు. తాజా ఎపిసోడే దీనికి సరైన ఉదాహరణ. అలానే రైతుబిడ్డ ఈ సీజన్‌లో చాలా తెలివిగా ఆడాడని అందరూ అనుకుంటున్నారు. కానీ మనోడి సేఫ్ గేమ్ ఇప్పుడు బయటపడింది. అయితే ఓ విషయంలో మాత్రం బిగ్‌బాస్ అస్సలు తీరు మార్చుకోవడం లేదు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 91 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

బిగ్‌బాస్ విన్నర్ ప్రైజ్‌మనీ
ఫినాలే టికెట్ గెలుచుకున్న అర్జున్.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినట్లు చెప్పడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ సీజన్‌లో విజేతగా నిలిస్తే ఏమేం దక్కుతాయో నాగార్జున ప్రకటించడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సీజన్ విన్నర్‌గా నిలిస్తే రూ.50 లక్షల నగదుతో పాటు మారుతి కార్, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతమవుతుందని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే రూ. 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారని అందరినీ నాగ్ అడిగితే.. అమ్మని ఈ డబ్బుతో హాయిగా చూసుకుంటా, తల్లిదండ్రులకు ఇల్లు కట్టిస్తా లాంటివి చెప్పారు. అయితే ఈ మొత్తం డిస్కషన్‌లో పెద్దగా డ్రామా పండలేదు. మొత్తం తేలిపోయింది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: ఆ కారణంతో అర్జున్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?)

ప్రమోషన్స్ మధ్య ఎపిసోడ్
అయితే వీకెండ్ ఎపిసోడ్ అంటే.. హౌసులో ఉన్నవాళ్లతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలి. కానీ బిగ్‌బాస్ టీమ్ దీనికంటే ప్రమోషన్స్‌పై ప్రేమ ఎక్కువైపోయింది. ప్రమోషన్స్ చేయొద్దని అనట్లేదు గానీ ఎపిసోడ్‌లో ఎక్కడో ఐదు నిమిషాల పాటు ప్రమోషన్ ఉంటే బాగుండేది.. ఈ ఆదివారం మాత్రం కాస్త ఎక్కువ లెంగ్త్ ఉండేసరికి చాలా బోర్ కొట్టేసింది. 'నా సామి రంగ', 'హాయ్ నాన్న' సినిమాల‍్ని ప్రమోట్ చేయడానికి వచ్చిన ఆషికా రంగనాథ్, నాని పర్వాలేదనిపించారు తప్పితే ఏమంత అలరించలేకపోయారు. 

ప్రశాంత్ సేఫ్ గేమ్?
సేవింగ్‌లో భాగంగా ప్రియాంక, శివాజీ, యావర్ వరసగా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. చివరగా ప్రశాంత్, శోభా, గౌతమ్ మిగిలారు. ఇలాంటి టైంలో ఎవిక్షన్ పాస్ ఉపయోగించాల్సిందేనని నాగార్జున అల్టిమేటం జారీ చేశాడు. లేకపోతే తిరిగిచ్చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఇక్కడ చాలా తెలివిగా ఆలోచించిన ప్రశాంత్.. శోభా-గౌతమ్ ఇద్దరిలో ఎవరికిచ్చినా ఇలాంటి టైంలో తను బ్యాడ్ అయిపోతానని తెలుసు. అందుకే ఎవరికి ఇచ్చేదే లేదని పదే పదే చెప్పాడు. తిరిగిచ్చేసి హీరో అయిపోదామనుకున్నాడు. కానీ ఇదంతా కూడా సేఫ్ గేమ్‌లా అనిపించింది తప్పితే ఇంట్రెస్టింగ్‌గా అయితే లేదు. ఆ తర్వాత ప్రశాంత్ సేవ్ అయ్యాడు. చివరగా శోభా బతికిపోయింది. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. 13వ వారం కావడం వల్లో ఏమో గానీ మనోడి.. ఎలిమినేట్ అయిపోయినా సరే పెద్దగా బాధపడలేదు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?)

>
మరిన్ని వార్తలు