Keerthi Bhat: అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌ గలీజ్‌ మాటలు.. కాళ్లు మొక్కుతానంటూ కీర్తి ఎమోషనల్‌

8 Dec, 2023 16:13 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో కొట్లాటలు కామన్‌.. వీరు గొడవపడ్తారు అంతలోనే మళ్లీ కలిసిపోతారు. కానీ బయట జరిగే కొట్లాటలు, గొడవలు, వివాదాలు మాత్రం అంతకుమించి అన్నట్లుగానే ఉంటాయి. సోషల్‌ మీడియాలో జరిగే ఫ్యాన్స్‌ వార్‌కు అయితే లెక్కే లేదు. అయితే కంటెస్టెంట్లను విమర్శించి, అక్కడితో ఆగకుండా వారి కుటుంబాలను కూడా గొడవలోకి లాగుతున్నారు. అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు.

గౌతమ్‌కు సపోర్ట్‌ చేయడమే పాపమైపోయింది!
పొరపాటున ఏ సెలబ్రిటీ అయినా తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్‌కు సపోర్ట్‌ చేయట్లేదని తెలిస్తే ఇక అంతే సంగతులు. బిగ్‌బాస్‌ బ్యూటీ కీర్తి భట్‌.. ఇటీవల ఎలిమినేట్‌ అయిన గౌతమ్‌ కృష్ణకు సపోర్ట్‌ చేస్తూ మాట్లాడింది. అతడికి వెల్‌కమ్‌ చెప్తూ జరిపిన సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. అంతే.. సీరియల్‌ బ్యాచ్‌కు కాకుండా గౌతమ్‌కు మద్దతు తెలపడంతో అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌ ఆమెను పచ్చిబూతులు తిడుతూ వేధిస్తున్నారట. దీంతో ఆవేదనకు గురైన కీర్తి సోషల్‌ మీడియాలో వీడియో రిలీజ్‌ చేసింది.

సోలోగా ఆడేవారికే నా సపోర్ట్‌
'కొద్ది రోజుల నుంచి నాకు చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వచ్చిన గౌతమ్‌ కృష్ణ సెలబ్రేషన్స్‌కు నేను వెళ్లాను. అప్పుడు ఇంటర్వ్యూలు అడిగితే ఇచ్చాను. అందులో ఎవరి గురించీ చెడుగా మాట్లాడలేదు. కానీ అమర్‌ ఫ్యాన్స్‌ కొందరు నన్ను చెండాలమైన బూతులు తిడుతున్నారు. నీ తల్లి కూడా ఒక ఆడదే కదా.. నేను బిగ్‌బాస్‌ హౌస్‌ లోపల ఉన్నప్పుడు ప్రియాంక, మానస్‌, మహేశ్‌ తప్ప నాకెవరూ సపోర్ట్‌ చేయలేదు. సోలోగా ఎవరు ఆడతారో వారికే నేను సపోర్ట్‌ చేస్తున్నాను. ఒక్కొక్కరికీ ఒక్కొక్కరు నచ్చుతారు. గౌతమ్‌ నాకు ముందునుంచీ పరిచయమే లేదు. తను ఒంటరిగా ఆడటం నచ్చింది.. అందుకే తన దగ్గరకు వెళ్లి సపోర్ట్‌ చేశా.. నా జీవితంలో నాకు నచ్చింది చేస్తాను. ఎందుకిలా వేధిస్తున్నారు?

నడిరోడ్డుపై కొడతా
మీకు దండం పెడతా.. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఫ్యాన్స్‌ అన్న పేరుతో ఇతరులను బాధపెట్టకండి. ఇంత గలీజ్‌గా మాట్లాడొద్దు. నా తప్పుంటే మీ అందరి కాళ్లు మొక్కుతా.. తప్పు లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను. సోషల్‌ మీడియాలో అలాంటి కామెంట్లు పెడుతుంటే చూసి చాలా హర్ట్‌ అవుతున్నాను. నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? అమ్మాయిలను గౌరవించండి. లోపల ఉన్న నలుగురి స్నేహితులకు పరోక్షంగా సపోర్ట్‌ చేస్తున్నాను. అది మీకేం తెలుసు? నా తిండి నేను తింటున్నాను. ఎవరి దగ్గరా అడుక్కోవట్లే.. నేను తిని నలుగురికి ఇస్తున్నాను. వీలైతే మీరు సాయం చేయండి. ఎవరు ఏ ఐడీ నుంచి మెసేజ్‌లు పెడుతున్నారో అవన్నీ ట్రాక్‌ చేసి మీరెక్కడున్నా వచ్చి నడి రోడ్డుపై కొడతా.. మీ అమ్మతోనే కొట్టిస్తా..' అని ఆగ్రహించింది కీర్తి భట్‌.

A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial)

A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial)

చదవండి: స్టార్‌ హీరోతో బెడ్‌రూమ్‌ సీన్‌... ఆ అత్యాచార సీన్‌ కంటే బెటరేనన్న బ్యూటీ

>
మరిన్ని వార్తలు