డూప్లికేట్‌, డబుల్‌ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

8 Dec, 2023 16:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: పక్క రాష్ట్రాల ఓటర్లకు ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ పెడుతూ.. డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.

వేరే రాష్ట్రాల్లో ఓటు ఉన్న వారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి. ఒక వ్యక్తి కి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలు కు విరుద్దం. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి. వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి’’ అని ఈసీ పేర్కొంది.

తప్పుడు డిక్లరేషన్‌తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష. 20 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్క్‌ ఇవ్వాలి. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు. ఇళ్లు మారే వాళ్లు ఓటుకి ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే కేసు నమోదు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు.

>
మరిన్ని వార్తలు