Bigg Boss 7 Telugu: ప్రియాంక-అమర్-శోభా మధ్య మనస్పర్థలు.. తప్పు ఎవరిది?

29 Nov, 2023 19:48 IST|Sakshi

బిగ్‌బాస్ గత సీజన్స్ మాటేమో గానీ ఈసారి మాత్రం బ్యాచ్‌ల గోల ఎక్కువైంది. అంతెందుకు రీసెంట్ వీకెండ్ ఎపిసోడ్‌లో స్వయంగా హోస్ట్ నాగార్జున ఒప్పుకొన్నాడు. చుక్క బ్యాచ్, ముక్క బ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. ఇందులో శివాజీ ఆధ్వర‍్యంలోని ముక్క బ్యాచ్ బాగానే ఉంది. చుక్క బ్యాచ్ అధ్వానంగా తయారైంది. బయటవాళ్లతో కాదు వీళ్లలో వీళ్లే గొడవపడి ఆ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరుగుతోంది?

(ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!)

ప్రస్తుత సీజన్‌లో సీరియల్ బ్యాచ్ సభ్యులైన అమర్, ప్రియాంక, శోభా.. ప్రారంభం నుంచి ఒక్కటిగా ఆడుతున్నారు. మరోవైపు శివాజీ, ప్రశాంత్, యావర్.. ఓ బ్యాచ్‌గా ఆడుతున్నారు. నామినేషన్స్ దగ్గర నుంచి గేమ్స్ వరకు పోటీ అంతా వీళ్ల మధ్య ఉంటోంది. శివాజీ బ్యాచ్‌తో పోలిస్తే సీరియల్ బ్యాచ్ కొన్ని విషయాల్లో బెటర్. కానీ ఇప్పుడు వీళ్లే తమ నిల్చున్న కొమ్మ తామే నరుక్కుంటున్నట్లు అనిపిస్తోంది.

తాజాగా 'టికెట్ టూ ఫినాలే' కోసం పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోభా, శివాజీ ఇప్పటికే తక్కువ పాయింట్లు సాధించిన కారణంగా గేమ్ నుంచి సైడ్ అయిపోయారు. అమర్, ప్రశాంత్, అర్జున్, గౌతమ్, యావర్, ప్రియాంక.. ఇలా దాదాపుగా అబ్బాయిలే ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా తక్కువ పాయింట్లు ఉన్న కారణంగా గేమ్ నుంచి సైడ్ అవ్వాలి. దీంతో ఆమె తన సగం పాయింట్లని వేరొకరికి ఇవ్వాలని చెప్పగా, గౌతమ్‌కి ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న క‌మెడియ‌న్‌ కిర్రాక్ ఆర్పీ..)

12వ వారం ప్రియాంక కెప్టెన్ కావడానికి గౌతమ్ సాయం చేశాడు. ఇప్పుడు పాయింట్స్ ఇచ్చి అతడి రుణం తీర్చుకుంది. అయితే పాయింట్స్ ఇవ్వడానికి తాను కనిపించలేదా అని అమర్ హర్ట్ అయిపోయారు. దీంతో శోభా-అమర్ ఒక్కటైపోయారు. ప్రియాంకని వేరు చేసి చూస్తున్నారు. ఇన్నాళ్లు ఒక్కటిగా ఉంటూ వచ్చిన సీరియల్ బ్యాచ్.. శివాజీని అన్ని విషయాల్లోనూ ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు చివరకొచ్చేసరికి వీళ్లలో వీళ్లు కొట్లాడుకుని.. శివాజీ బ్యాచ్ కి హెల్ప్ అయ్యేలా ఉన్నారనిపిస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే మాత్రం.. తెలియకుండానే శివాజీ బ్యాచ్ కి హెల్ప్ చేసినట్లు అవుతుంది. గేమ్‌లో ఉన్న ఆ కాస్త మజా కూడా పోవడం గ్యారంటీ.

అయితే ఈ గొడవలో ప్రియాంక కాస్త ఆలోచనతో వ్యవహరించినట్లు అనిపించింది. అమర్ మాత్రం ప్రతిదానికి అలుగుతూ తనపై ఉన్న సింపతీని కాస్త నెగిటివిటీ చేసుకునేలా కనిపిస్తున్నాడు. మరోవైపు అతడికి సపోర్ట్ చేస్తున్న శోభా కూడా తెలియకుండానే మరింత నెగిటివీ తెచ్చుకుంటోందనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు)

మరిన్ని వార్తలు