-

Bigg Boss: బిగ్‌బాస్‌ షో.. ఎలిమినేట్ అయిన ట్రాన్స్‌జెండర్!

27 Nov, 2023 16:09 IST|Sakshi

బిగ్ బాస్ రియాలిటీ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. బుల్లితెరపై ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తోంది. దక్షిణాదిలో ప్రస్తుతం బిగ్‌బాస్ హవా నడుస్తోంది. ఈ ఏడాది కన్నడలో సీజన్- 10 నడుస్తోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షోలో.. ఈ వారంలో ట్రాన్స్‌జెండర్ మహిళ నీతూ వనజాక్షి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. దాదాపు 50 రోజులపాటు హౌస్‌లో ఉన్న నీతూ ఏడోవారంలో బయటకొచ్చేసింది. అయితే ఈ వారంలో ఆమెనే హౌస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఎలిమినేషన్ తర్వాత ప్రత్యేక ఇంటర్వ్యూలో నీతూ తన అభిప్రాయాలను  వెల్లడించింది. 

బిగ్‌బాస్‌ హోస్‌లో 50 రోజులు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. కంటెస్టెంట్‌గా నేను ఎక్కువ రోజులు ఉన్నందుకు గర్వపడుతున్నా. ఎన్నో అనుభవాలతో ఇంటికి వెళ్తున్నా. ఈ అనుభవాలతో మరింత ముందుకు సాగుతా. మీరు బయటకు వస్తారని నేను ఊహించా. గత రెండు వారాలుగా నా పనితీరు చాలా తక్కువగా ఉంది. కానీ కెప్టెన్సీ టాస్క్‌లో బాగా ఆడాను. కానీ దురదృష్టం నన్ను వెంటాడింది.  హౌస్‌లో ఉన్న ప్రతాప్, తుకలి సంతోష్, సంగీత, కార్తీక్, తనీషా ఈసారి బిగ్ బాస్ టాప్ ఫైవ్‌లో ఉంటారు. ఈ సీజన్‌ విన్నర్‌గా ప్రతాప్ నిలుస్తాడంటూ నీతూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. 

బిగ్‌బాస్‌ అవకాశంపై మాట్లాడుతూ.. 'నాకు ప్రేమ కావాలి కానీ.. సానుభూతి అవసరం లేదు. బిగ్‌బాస్‌లోకి రావడం మంచి అవకాశం. ఇంట్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. ఈ ఈ జ్ఞాపకాలను నా జీవితాంతం గుర్తుంచుకుంటా. అలాగే ట్రాన్స్‌జెండర్ల జీవితం గురించి చాలా మందికి తెలియదు. మేం ఏమి కోరుకుంటున్నామో, సమాజం నుంచి ఏమి ఆశిస్తున్నామో కూడా తెలియదు. చివరికి మాకు కావలసింది ప్రేమ మాత్రమే. మాకు ఎవరీ జాలీ, దయ అక్కర్లేదు. ప్రేమను పంచితే చాలు. అది నాకు బిగ్ బాస్ హౌస్ ఇచ్చింది.' అని అన్నారు.

మరిన్ని వార్తలు