Bigg Boss 5 Telugu: అవ‌కాశాన్ని వాడుకోమ‌న్న నాగ్‌, అత‌డు డేంజ‌ర్ అంటోన్న శ్వేత‌

17 Oct, 2021 23:34 IST|Sakshi

Bigg Boss 5 Telugu, Episode 43: లోబో తండ్రి చనిపోయిన‌ప్పుడు వాడితో నేనున్నాను, ఆ టైంలో ఎవ‌రూ లేక‌పోయినా మూడు రోజులు వాడితో ఉన్నాను. అత‌డు అమాయ‌కుడు అంటూ హౌస్ నుంచి వెళ్లిపోయిన‌ త‌న జిగిరీ దోస్త్‌ను గుర్తు చేసుకుని ఎమోష‌న‌ల్ అయ్యాడు ర‌వి. ఇక నాగ్‌.. ఇంటిస‌భ్యుల‌తో ఫ‌న్ టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా స‌న్నీ, మాన‌స్‌, జెస్సీ, యానీ, ప్రియ‌, శ్వేత‌ల‌ను బి టీమ్‌గా మిగిలిన వారిని ఏ టీమ్‌గా విభ‌జించాడు. టాస్క్‌లో భాగంగా చీటీలో ఉండే పాట పేరును పీక‌తో వాయించ‌గా మిగిలిన వారు గుర్తుప‌ట్టాలి.

బిగ్ బ్ర‌ద‌ర్‌గా చెప్తున్నా.. ఈ అవ‌కాశాన్ని వాడుకో: నాగ్‌
మొద‌ట‌గా ష‌ణ్ను పీక‌తో మ్యూజిక్‌ వాయించ‌గా సిరి.. అది రింగ‌రింగ పాట అని ఇట్టే గుర్తుప‌ట్టింది. త‌ర్వాత స‌న్నీ వాయించిన పాట‌ను శ్రీరామ్‌.. సారంగ‌ద‌రియా అని ప‌సిగ‌ట్టాడు. ఇలా ప్ర‌తి ఒక్క‌రు చిట్టీ తీయ‌డం, దాన్ని క‌రెక్ట్‌గా గెస్ చేసిన టీమ్ డ్యాన్స్ చేయ‌డం జ‌రిగింది. మొత్తంగా ఈ టాస్క్‌లో టీమ్ ఏ గెలిచింది. అనంత‌రం నాగ్‌.. ష‌ణ్ముఖ్‌, ప్రియాంక, శ్రీరామ్‌, స‌న్నీ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించాడు. మ‌రోప‌క్క సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబోను ప‌ల‌క‌రించాడు నాగ్‌. నీకో బిగ్ బ్ర‌ద‌ర్‌గా చెప్తున్నా.. ఈ అవ‌కాశాన్ని బాగా వాడుకో..  అని స‌ల‌హా ఇచ్చాడు. కానీ లోబో మాత్రం సీక్రెట్ రూమ్‌లో ఉన్నందుకు సంతోషించాల్సింది పోయి నిరుత్సాహ‌ప‌డ్డాడు.

శ్వేత ఎలిమినేట్, ఏడుపందుకున్న కంటెస్టెంట్లు
త‌ర్వాత‌ ఇంటిస‌భ్యుల క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి గేమ్ ఆడించారు. ఇందులో క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకున్న వారు బోనును క‌నుక్కోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో కూడా టీమ్ ఏ విజ‌యం సాధించింది. అనంత‌రం జెస్సీ సేఫ్ అయిన‌ట్లు నాగ్‌ వెల్ల‌డించాడు. మిగిలిన సిరి, శ్వేత‌ను గార్డెన్ ఏరియాకు ర‌మ్మ‌న్న నాగ్‌.. వారితో ఓ బాక్సు బ‌ద్ద‌లు చేయించాడు. అందులోని బాక్సులో ఎవ‌రి ఫోటో ఉందో వాళ్లు సేఫ్ అని తెలిపాడు. ఆ బాక్సు తెరిచి చూడ‌గా అందులో సిరి ఫొటో ఉండ‌టంతో ఆమె హౌస్‌లో కంటిన్యూ కాగా శ్వేత ఎలిమినేట్ అయింది. దీంతో షాక్‌కు గురైన‌ యానీ, స‌న్నీ, ప్రియాంక, విశ్వ‌ ఏడుపందుకున్నారు.

వాళ్ల‌ను టాప్ 5లో చూడాల‌నుకుంటున్నా: శ్వేత‌
ఇక స్టేజీ మీద‌కు వ‌చ్చిన శ్వేత‌తో సైన్ గేమ్ ఆడించాడు నాగ్‌. ర‌వి వెరీ స్మార్ట్ అని, అత‌డికి దూరంగా ఉండాల‌ని కంటెస్టెంట్ల‌ను హెచ్చ‌రించింది శ్వేత‌. హౌస్‌లో మాన‌స్ డేంజ‌ర్ అని అభిప్రాయ‌ప‌డింది, త‌క్కువ మాట్లాడి ఎక్కువ ఆడాల‌ని యానీ మాస్ట‌ర్‌కు స‌ల‌హా ఇచ్చింది. నిన్ను టాప్ 5లో చూడాల‌నుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చింది. శ్రీరామ్‌కు త్వ‌ర‌గా రీచార్జ్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. అత‌డిని టాప్ 5లో చూడాల‌నుకుంటున్నానంది.

విశ్వ ఒలంపిక్స్‌కు కూడా వెళ్తాడ‌నిపిస్తోంది
విశ్వ గేమ్‌లో దారి త‌ప్పుతున్నాడంది. కాక‌పోతే టాస్కుల్లో ట‌ఫ్ కాంపిటీష‌న్ ఇస్తున్నాడ‌ని, అత‌డిని చూస్తుంటే విశ్వ ఒలంపిక్స్‌కు కూడా వెళ్లిపోవ‌చ్చ‌నిపిస్తుంద‌ని చెప్పుకొచ్చింది శ్వేత‌. కాజ‌ల్ డెడ్ ఎండ్ అని, మాట మార్చి యూట‌ర్న్ తీసుకుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. శ్రీరామ్‌.. శ్వేత కోసం ముస్త‌ఫా ముస్త‌ఫా పాట పాడి అక్క‌డున్న‌వాళ్ల‌ను ఏడిపించాడు. అనంత‌రం భార‌మైన హ‌00ద‌యంతో అంద‌రి ద‌గ్గ‌రా వీడ్కోలు తీసుకుంది శ్వేతా వ‌ర్మ‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు