Bigg Boss Telugu 5: ఆమె నాకంటే వీక్‌, వాళ్ల మీద మంచి ఒపీనియ‌న్ లేదు

18 Oct, 2021 19:10 IST|Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌లో సెట్ శ్వేత ఒక‌రు. ముక్కుసూటిత‌నం, ఏదైనా నిల‌దీసే గుండెధైర్యం.. ఇవ‌న్నీ చూసి శ్వేత హౌస్‌లో చాలారోజుల‌పాటు కొనసాగుతుంద‌నుకున్నారంతా! కానీ ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ఆమెను ఆరోవారంలోనే షో నుంచి పంపించివేశారు. బిగ్‌బాస్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు నెటిజ‌న్లు. లోబోకు బ‌దులుగా ఆమెను సీక్రెట్ రూమ్‌కు పంపించినా ఆట ర‌స‌వ‌త్త‌రంగా ఉండేద‌ని పెద‌వి విరుస్తున్నారు. త‌ను రీఎంట్రీ ఇస్తే బాగుండ‌ని ఆశ‌ప‌డుతున్నారు అభిమానులు.

ఇదిలా వుంటే ఎలిమినేట్ అయిన శ్వేతా వ‌ర్మ.. అరియానా గ్లోరీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్‌బాస్ బ‌జ్ షోకు హాజ‌రైంది. ఈ సంద‌ర్భంగా హౌస్‌మేట్స్ గురించి త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించింది. ర‌వి ఏది చెప్తే అది లోబో ఫాలో అయిపోతాడంది, ఇక ర‌వి త‌న గేమ్ త‌ను ఆడాల‌ని హిత‌వు ప‌లికింది. మీ కంటే వీక్ కంటెస్టెంట్ ఎవ‌రున్నారు? అన్న అరియానా ప్ర‌శ్న‌కు కాజ‌ల్ మీద మంచి ఒపీనియ‌న్ లేదని చెప్పుకొచ్చింది. ర‌వి మీద కూడా పాజిటివ్ ఒపీనియ‌న్ లేద‌ని తెలిపింది. బిగ్‌బాస్ హౌస్‌లో మొద‌టి రోజు నుంచి సిరిని ఇండివిడ్యువ‌ల్‌గా చూడ‌లేదంది. సిరి.. ష‌ణ్ముఖ్‌, జెస్సీని రెచ్చ‌గొడుతుందా? అన్న ప్ర‌శ్న‌కు శ్వేత అవున‌ని బ‌దులిచ్చింది. మా అమ్మ ఉండుంటే ఇంకోలా ఉండేది, నా త‌ల్లిని మిస్ అవుతున్నాను అంటూ ఎమోష‌న‌ల్ అయింది శ్వేత‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు