Bigg Boss 5 Telugu: సిరిని చూడగానే ఏడుపొచ్చింది, ఇద్దరం డిప్రెషన్‌లో ఉన్నాం..: శ్రీహాన్‌

11 Dec, 2021 16:45 IST|Sakshi

Bigg Boss Telugu 5: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే బిగ్‌బాస్‌ షో ముగింపుకు వచ్చింది. 19 మందితో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఈ వారం ఎలిమినేషన్‌తో ఎవరు ఫినాలేకు వెళ్తారనేది డిసైడ్‌ కానుంది. ఇకపోతే ఈ వారం సిరి, కాజల్‌ ఇద్దరూ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో సిరికి సపోర్ట్‌ చేస్తున్న ఆమె ప్రియుడు, కాబోయే భర్త శ్రీహాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చాడు.

'మొట్టమొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చాను. అది కూడా నా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కాకుండా సిరి ప్రొఫైల్‌ నుంచి లైవ్‌లోకి వచ్చా. చివరి వారంలో సిరికి కాస్త గట్టిగా సపోర్ట్‌ చేద్దాం. తను టాప్‌ 5 అర్హురాలు. టాస్క్‌ల్లో వెనక్కి తగ్గడం లేదు. హౌస్‌లోకి వెళ్లాక చిన్నచిన్నవి జరుగుతుంటాయి, వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన పనిలేదు. చాలామంది ఏదో జడ్జ్‌ చేసి మాట్లాడుతుంటారు.. అవన్నీ లైట్‌ తీసుకోండి, పాజిటివ్‌ మైండ్‌తో ఉందాం.

సిరి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్తున్నప్పుడు ఆమె ఎన్నోరోజులు ఉండదనుకున్నా, నాతోపాటు సిరి కూడా ఇన్నిరోజులు ఉంటుందని ఊహించలేదు. కానీ ఇన్నిరోజులు ఉందంటే ఆమెలో మ్యాటర్‌ ఉంది కాబట్టే! గంటపాటు షోని చూసి జడ్జ్‌ చేస్తున్నవాళ్లని తప్పుపట్టలేం. ఎవరి కోణంలో వాళ్లు చూస్తారు. సిరి పేరు చెప్పుకుని కొంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు.. అంతవరకు నేను హ్యాపీ.

మేము హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో సిరి ఉద్యోగం చేసేది. బస్‌లు మారుతూ ఆఫీస్‌కు వెళ్లేది. అప్పుడు ఇద్దరం కలుసుకోవడానికి చాలానే కష్టపడేవాళ్లం. మొదట టీవీ న్యూస్‌.. తర్వాత సీరియల్స్‌.. ఇప్పుడు బిగ్‌బాస్‌లో చూస్తున్నాం. ఆమె గురించి తెలియనివాళ్లకు ఈ కొత్త అమ్మాయి ఎవరు బిగ్‌బాస్‌లోకి వచ్చింది అనుకుంటారు. విజయం అనేది ఏ అమ్మాయికీ అంత ఈజీగా రాదు. నిజానికి అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ కష్టపడాలి. ఈ క్రమంలో నిందలు సైతం పడాల్సి వస్తుంది. సిరి ఎన్నో కష్టనష్టాల కోర్చి ఇక్కడ వరకూ వచ్చింది. ఇంతదాకా వచ్చిన సిరికి మద్దతుగా నిలబడదాం. తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా..

బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లినప్పుడు సిరిని చూడగానే చాలా ఏడుపు వచ్చింది. కానీ నేను ఏడిస్తే తను ఏడుస్తుందని కన్నీళ్లను ఆపుకున్నా. అప్పటికే తను చాలా డిప్రెషన్‌లో ఉంది, డిప్రెషన్‌లో ఉంటే గేమ్‌ ఎఫెక్ట్‌ అవుతుంది. అందుకే ఆమె గేమ్‌పై ఫోకస్‌ పెట్టేలా చేయాలనుకున్నా. తన మైండ్‌ను పాజిటివ్‌గా ఉంచాలనుకున్నా. నాక్కూడా బాధ, డిప్రెషన్‌ ఉంది.. బట్‌ నా మైండ్‌కు నేను సమాధానం చెప్పుకున్నా. తనేంటో నాకు తెలుసు. వాళ్లు ఉన్న పరిస్థితిలో మనం ఉండి ఆలోచిస్తే ఆ బాధ తెలుస్తుంది' అని ఎమోషనల్‌ అయ్యాడు శ్రీహాన్‌.

మరిన్ని వార్తలు