Bigg Boss 5 Telugu: టికెట్‌ టు ఫినాలే రేసులో నుంచి ఆ ముగ్గురు అవుట్‌!

2 Dec, 2021 16:51 IST|Sakshi

Bigg Boss Telugu 5: ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క.. ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు ముఖ్యం.. ఫినాలేలో అడుగుపెట్టామా? లేదా? అన్నది పాయింట్‌! ఇప్పుడు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు కూడా ఫినాలే టికెట్‌ కోసం రేసు మొదలు పెట్టారు. మరి హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరు టికెట్‌ సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకు ఎండురెన్స్‌, స్పీడ్‌ టాస్క్‌లు పూర్తవగా ముచ్చటగా మూడో టాస్క్‌ కూడా ప్రారంభమైనట్లు తాజా ప్రోమోలో కనిపిస్తోంది. స్కిల్‌ చాలెంజ్‌లో శ్రీరామ్‌, సిరి మినహా మిగతా అందరూ ఆడినట్లు కనిపించింది. నిన్నటి ఐస్‌క్యూబ్స్‌ గేమ్‌ ఫలితం కారణంగా సిరి, శ్రీరామ్‌ లేచి నిలబడలేని స్థితిలో ఉన్నారు. దీంతో వీరిద్దరి తరపున షణ్ను, సన్నీ గేమ్‌ ఆడినట్లు సమాచారం! మొత్తానికి మానస్‌, సన్నీ, సిరి, శ్రీరామ్‌ ఫైనల్‌ గేమ్‌కు అర్హత సాధించగా, కాజల్‌, ప్రియాంక, షణ్ను రేసు నుంచి అవుట్‌ అయినట్లు వినికిడి! మరి ఆ నలుగురిలో ఎవరు ముందుగా ఫినాలేలో అడుగుపెడతారో చూడాలి!

మరిన్ని వార్తలు