బిగ్‌ బాస్‌: నా ప్రైజ్‌ మనీలో వాళ్లే రూ. 27 లక్షలు తీసుకున్నారు: వీజే సన్నీ

16 Nov, 2023 09:22 IST|Sakshi

బిగ్గెస్ట్‌ రియాలటీ షోగా  బిగ్‌బాస్‌కు మంచి గుర్తింపు ఉంది. అందులో వారం వారం కంటెస్టెంట్‌లకు రెమ్యునరేషన్‌తో పాటు రూ. 50 లక్షల ప్రైజ్‌ మనీ ఉంటుంది. దీంతో ఎలాగైన విన్నర్‌ కావాలని అందరూ అనుకుంటారు. ఈ షో ద్వారా మంచి అవకాశాలతో పాటు చేతకి డబ్బు కూడా అందుతుందని భావిస్తారు. బిగ్‌ బాస్‌ ప్రైజ్‌ మనీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీజన్‌-5 విన్నర్‌ వీజే సన్నీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

'నేను విన్నర్ అయితే కంగ్రాట్యులేట్ నా ఒక్కడికే చెప్పకోలేదు.. గవర్నమెంట్‌కి కూడా చెప్పాను. ఎందుకంటే.. జీఎస్టీ ద్వారా నాకంటే ఎక్కువగా.. దాదాపు ఫిఫ్టీ- ఫిఫ్టీ షేర్ చేసుకున్నట్టే మేము. ఆడింది నేను.. గెలిచింది వాళ్లు అనేలా ఉంది. ఆట నాది ప్రైజ్ మనీ వాళ్లది.  బిగ్‌ బాస్‌ విన్నర్‌ అయిన నాకు  రూ.50 లక్షలు ఇవ్వాలి కానీ అందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికి వెళ్లిపోయింది. అంత డబ్బు టాక్స్ రూపంలో తీసేసుకున్నారు. కరెక్ట్‌గా ఎంతనేది నాకు గుర్తు లేదు కానీ.. దాదాపు సగానికి సగం టాక్స్ ద్వారా తీసేసుకున్నారు.

గవర్నమెంట్ టాక్స్ కట్ చేసుకున్న తరువాతే మిగిలిన అమౌంట్ నాకు వచ్చింది. ఛానల్‌ వాళ్లు టాక్స్‌ రూపంలో ఆ డబ్బు కట్‌ చేసుకుని మిగిలన మొత్తం ఇస్తారు. డొనేషన్స్ రూపంలో చాలామంది టాక్స్ ఎగ్గొడుతుంటారు కానీ.. మనకి అన్ని తెలివితేటలు ఉంటే.. ఇక్కడెందుకు ఉంటాం.. అందుకే ఫుల్ అమౌంట్ టాక్స్ రూపంలో కట్టాల్సి వచ్చింది.' అంటూ తన ప్రైజ్ మనీ గురించి చెప్పుకొచ్చాడు వీజే సన్నీ.  ఈ లెక్కన ఆయనకు కేవలం రూ. 23 లక్షలు చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పన్నుతో పాటు అదనంగా జీఎస్టీ కూడా చేరడంతో ప్రైజ్‌ మనీలో ఎక్కువ కోత పడిందని ఆయన తెలిపాడు.

బిగ్‌ బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న వీజే సన్నీ హీరోగా పలు సినిమా  ఛాన్సులు దక్కించుకుంటున్నాడు.  వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కత్వం వహించారు. తొలుత నవంబరు తొలివారంలో రిలీజ్ అనుకున్నారు కానీ వాయిదా పడింది. తాజాగా నవంబరు 24న కొత్త విడుదల అని ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.  

మరిన్ని వార్తలు