దక్షిణాది స్టార్ హీరోలతో పనిచేశా.. కానీ ఎక్కడా అలా జరగలేదు: పాయల్ ఘోష్

18 Mar, 2023 20:53 IST|Sakshi

బాలీవుడ్ నటి  పాయల్ ఘోష్ టాలీవుడ్‌కు సుపరిచితమైన పేరు. మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఊసరవెల్లి చిత్రంలోనూ కనిపించింది పాయల్. ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ సినిమా కూడా చేసింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో తనదైన నటనతో మెప్పించింది. బెంగాలీ అయినా పాయల్ ఘోశ్ తాజాగా సంచలన ట్వీట్స్ చేసింది. తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగిక వేధింపులకు గురి చేశాడని ఇప్పటికే ఫిర్యాదు చేసిన నటి మరోసారి వరుస ట్వీట్లతో వార్తల్లో నిలిచింది.  

పాయల్ ట్వీట్‌లో రాస్తూ..' నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశా. కానీ ఎవరూ నన్ను ఆ విధంగా టచ్ చేయలేదు. కానీ బాలీవుడ్‌లో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో పని చేయలేదు. అతన‍్ని మూడోసారి కలిసినప్పుడే నన్ను రేప్ చేశాడు. ఇప్పుడు నేను ఎందుకు సౌత్ గురించి గొప్పగా చెప్పుకోకూడదో చెప్పండి. అలాగే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా పనిచేశా. కానీ అతను కూడా నాతో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. ఆయనొక జెంటిల్‌మెన్. అందుకే నాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం.' అంటూ పోస్ట్ చేసింది. తాజాగా ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు