నన్ను క్షమించగలవా?

3 Feb, 2023 01:25 IST|Sakshi

ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ మార్తాండ’. నటుడు బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. కాలిపు మధు, ఎస్‌. వెంకట్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. బ్రహ్మానందం పుట్టినరోజు (ఫిబ్రవరి 1) సందర్భంగా ‘రంగ మార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు.

‘‘ధగ ధగ్గాయ రాజమకుట సువర్ణ మణిగణ రాజరాజేశ్వరా, సుయోధన సౌర్వభౌమ.. శరాఘతాలతో ఛిద్రమై.. ఊపిరి ఆవిరై దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ.. అఖండ భారత సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని శుష్క వాగ్దానాలు వల్లెవేసిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా? నా దైవ స్వరూపమా.. నన్ను క్షమించగలవా?’’ అంటూ భావోద్వేగంతో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్‌తో గ్లింప్స్‌ సాగుతుంది. రాహుల్‌ సిప్లిగంజ్, శివాత్మిక నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా. 

మరిన్ని వార్తలు