పంచేంద్రియాల నేపథ్యంలో...

23 Feb, 2021 01:08 IST|Sakshi
బ్రహ్మానందం, రాహుల్‌ విజయ్, హర్ష పులిపాక

డా. బ్రహ్మానందం, యువ హీరో రాహుల్‌ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ముఖ్య తారలుగా ఓ చిత్రం రూపొందనుంది. హర్ష పులిపాక దర్శకుడు. టికెట్‌ ఫ్యాక్టరీ–ఎస్‌ ఒరిజినల్స్‌ పతాకాలపై అఖిలేష్‌ వర్ధన్, సృజన్‌  ఎరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సృజన్‌  ఎరబోలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మరో ముగ్గురు స్టార్లు కూడా నటించనున్నారు. 13 రోజుల పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో, ఆ తర్వాత విశాఖ, పాండిచ్చేరిలో షెడ్యూల్స్‌ ప్లాన్‌  చేశాం.

‘కలర్‌ ఫొటో’ దర్శకుడు సందీప్‌ రాజ్‌ మా చిత్రానికి మాటలు రాయడం హ్యాపీ’’ అన్నారు. హర్ష పులిపాక మాట్లాడుతూ– ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు (చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన) చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. యువతరం ఆలోచనలకు అద్దం పట్టేలా కథ, కథనాలు నిజాయతీగా ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, కెమెరా: రాజ్‌ కె. నల్లి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌  సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి, రఘురామ్‌ శ్రీపాద.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు