వాయిదా పడ్డ 'బుట్ట బొమ్మ', రిలీజ్‌ ఎప్పుడంటే..

21 Jan, 2023 17:43 IST|Sakshi

అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుట్ట బొమ్మ’. ఎస్.నాగవం శీ, సాయిసౌజన్య నిర్మిం చిన ఈ చిత్రంతో  శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఈ చిత్రం జనవరి 26న విడుదల కావాల్సింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది. కాస్త ఆలస్యంగా వచ్చినా ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా 'బుట్టబొమ్మ' సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు