విశాల్‌ ఆరోపణతో సంచలన నిర్ణయం తీసుకున్న సెన్సార్‌ బోర్డు

5 Oct, 2023 07:29 IST|Sakshi

విశాల్‌ నటించిన 'మార్క్‌ ఆంటోని' సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ విషయంలో లంచం ఇవ్వాల్సి వచ్చిందని  CBFC (Central Board of Film Certification)పై ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సెన్సార్‌ కోసం దాదాపు రూ. 6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన చెప్పారు. ఈ విధంగా ముంబయి సెన్సార్ బోర్డు కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందంటూ నటుడు విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై  కేంద్ర సమాచార, ప్రసార శాఖ అత్యవసర బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశం అనంతరం సెన్సార్‌ బోర్డు ఒక కీలక నిర్ణయంతో పాటు విశాల్‌ ఆరోపణలపై కూడా స్పందించింది.

(ఇదీ చదవండి: ఆ తెలుగు డైరెక్టర్‌ ప్రేమలో సంఘవి.. దీంతో కెరియరే నాశనమైందా..?)

విశాల్‌ను లంచం డిమాండ్‌ చేసింది సెన్సార్‌ బోర్డు సభ్యులు కాదని కేంద్ర సెన్సార్‌ బోర్డు ప్రకటించింది. ఆయన నుంచి డబ్బు తీసుకుంది థర్డ్‌పార్టీ వారని వెల్లడించింది. ఈ కేసు విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.  సెన్సార్‌ బోర్డులో ఇలాంటి పరిణామాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఇకనుంచి ఆన్‌లైన్‌లోనే సినిమాల సెన్సార్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సెంట్రల్‌ సెన్సార్‌ బోర్డు తెలిపింది.

ఈ మేరకు ఈ- సినీప్రమాన్‌లో దర్శక, నిర్మాతలు రిజస్టర్‌ చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియలో కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సెన్సార్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రతి సంవత్సరం CBFC వద్దకు సుమారు 18వేల చిత్రాలు సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం వస్తుంటాయని.. అన్ని సినిమాలు చూడాలంటే సభ్యులకు సమయం పడుతుంది అని గుర్తుచేసింది. కాబట్టి నిర్మాతలు కూడా తమ సినిమాకు ముందుగా సెన్సార్‌ ఇ‍వ్వాలని కోరరాదని తెలిపింది. నిబంధనల ప్రకారమే ఇక నుంచి ఆన్‌లైన్‌లో సెన్సార్‌ కోసం ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

మరిన్ని వార్తలు