Chiranjeevi-Tickets Price: సినిమారంగం నష్టపోయింది, అలాంటప్పుడు వేడుకుంటే తప్పు లేదు

26 Apr, 2022 14:30 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే! తాజాగా రెండు రాష్ట్రాల్లో టికెట్‌ రేట్లు పెంచడంపై చిరంజీవి స్పందించాడు. కరోనాతో అన్ని రంగాలు కుంటుపడ్డాయని, ప్రపంచంలో అన్ని రంగాలు నష్టపోయినట్లు సినిమా రంగం కూడా నష్టపోయిందని వ్యాఖ్యానించాడు. తాము కూడా 42% టాక్స్‌లు కడుతున్నామని, కరోనా వల్ల వడ్డీలు పెరిగి బడ్జెట్‌ కూడా పెరిగిందని పేర్కొన్నాడు. అలాంటప్పుడు టిక్కెట్‌ రేట‍్ల గురించి ప్రభుత్వాల దగ్గర వేడుకుంటే తప్పులేదన్నాడు.

కాగా ఈ నెల 29 నుంచి మే 5 వరకు టికెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై  మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు సైతం వారం రోజుల పాటు అనుమతి కల్పించింది. 

చదవండి: దూరంగా ఉంటానన్న సింగర్‌, కానీ డబ్బుల కోసం మళ్లీ మొదలుపెట్టింది!

మరిన్ని వార్తలు