త్రిషకు చిరంజీవి మద్ధతు.. అసలు కారణం ఇదా..?

30 Nov, 2023 13:37 IST|Sakshi

బుర‌ద‌లో రాయి వేస్తే ఏమౌతుంది..? ఆ బుర‌ద మ‌నకే అంటుతుంది అనేలా ఉంది కోలీవుడ్‌లో మన్సూర్‌ వివాదం. మొదట హీరోయిన్‌ త్రిషపై ఆయన చేసిన అసభ్య కామెంట్లతో మొదలైన గొడవ టాలీవుడ్‌పై కూడా ప్రభావం చూపింది. త్రిషకు మద్ధతుగా మెగాస్టార్‌ చిరంజీవి నిలిచిన పాపానికి తిరిగి అతనిపైన చెత్త మాటలు విసిరాడు మన్సూర్‌.  త్రిష‌, ఖుష్భూ, చిరంజీవిల‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తానంటూ ప్ర‌క‌టించిన మ‌న్సూర్ అంతటితో ఆపలేదు. తనది వ‌క్ర‌బుద్ధి అన్న చిరంజీవి గ‌తంలో పార్టీ పెట్టి వేల కోట్లు దండుకున్నాడని, కనీసం పేదలకు కూడా ఎలాంటి  సాయం చేయ‌లేద‌ని ఆరోపించాడు.

అంతే కాకుండా  రీయూనియన్‌ పేరుతో అలనాటి హీరోయిన్లతో పార్టీలు చేసుకోవడం వంటి మాటలు విసిరాడు. సౌత్‌ ఇండియాలో 1980-1990 దశకంలో రానించిన హీరో,హీరోయిన్లతో చిరంజీవి రీయూనియన్‌ అవుతున్నాడు. కానీ దీనిని మన్సూర్‌ తప్పుగా క్రియేట్‌ చేశాడు. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే మన్సూర్‌ చేశాడనేది చెన్నై ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అందుకే ఆయన రోజుకో మాట మాట్లాడుతున్నాడని చెప్పుకొచ్చింది.

త్రిషకు చిరంజీవి సపోర్ట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటని చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న... మెగాస్టార్‌- వశిష్ట కాంబోలో విశ్వంభర చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో త్రిష ఒక హీరోయిన్‌గా తీసుకున్నారని టాక్‌ ఉంది. అందుకే త్రిష కోసం సపోర్టుగా చిరంజీవి నిలిచారని సమాచారం. చాలా వరకు వివాదాలకు దూరంగా ఉండే చిరు.. త్రిష కారణంగా అవసరంలేని మాటలు పడుతున్నాడు. అంతేకాకుండా ఆధారాల్లేని ఆరోపణలు ఎదర్కొవాల్సి వస్తుంది. ఈ అంశంపై మన్సూర్‌ పట్ల చిరంజీవి ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

మరిన్ని వార్తలు