తెలంగాణ ఎన్నికలు: గంటకు పైగానే క్యూ లైన్లోనే ఉన్న అల్లు అర్జున్‌

30 Nov, 2023 08:07 IST|Sakshi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- 2023 పోలింగ్‌ మొదలైంది.  రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.  ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

టాలీవుడ్‌ నుంచి పులువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన ఓటును వినియోగించుకునేందుకు సుమారు గంటకు పైగానే క్యూ లైన్లో ఉన్నారు. హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌ 153 వద్ద అల్లు అర్జున్ ఓటు వేసేందుకు వచ్చాడు.  టాలీవుడ్‌ ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా పోలింగ్‌ కేంద్రం వద్దకు బన్నీ వచ్చాడు. ఉదయం 6:50 గంటలకే పోలింగ్‌ కేంద్రం వద్దకు ఆయన చేరుకున్నాడు. ఆయన క్యూ లైన్‌లో ఉండగా కొంత సమయం పాటు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అల్లు అర్జున్‌ గంటకు పైగానే క్యూ లోన్లోన్‌లోనే ఉన్నాడు.

మరిన్ని వార్తలు