రాజశేఖర్‌‌ ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్‌

22 Oct, 2020 14:08 IST|Sakshi

హీరో రాజశేఖర్‌ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన భార్య జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మికకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం​ వీరంతా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, రాజశేఖర్‌ ఆరోగ్యం కాస్త విషమంగా ఉందని గురువారం ఆయన కూతురు శివాత్మిక ట్వీట్‌ చేసింది. ‘ప్రియమైన ప్రతి ఒక్కరికి కోవిడ్‌తో నాన్నా పోరాటం చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ అతను గట్టిగా పోరాడుతున్నాడు. మీ ప్రార్థనల ప్రేమ శుభాకాంక్షలు మమ్మల్ని రక్షిస్తాయని అనుకుంటున్నాను. నాన్నా త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని అడుగుతున్నాను. మీ ప్రేమతో, అతను త్వరగా బయటకు వస్తారని ఆశిస్తున్నాను’ అని శివాత్మిక ట్వీట్ చేసింది.
(చదవండి : నాన్న కోవిడ్‌తో పోరాడుతున్నారు: శివాత్మిక)

 ఆతర్వాత కాసేపటికే నాన్న బాగానే ఉన్నారంటూ మరో ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో శివాత్మిక ట్వీట్‌పై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. రాజశేఖర్‌ త్వరగా కోలుకొవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ‘ప్రియమైన శివత్మికా మీ ప్రేమగల నాన్న, నా సహా నటుడు, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన కోసం అలాగే మీ కుటుంబం కోసం నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ధైర్యంగా ఉండు’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఇక రాజశేఖర్‌ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రి సిబ్బంది హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌లో ఉన్నప్పటికీ వైద్యానికి హీరో రాజశేఖర్‌ స్పందిస్తున్నారని తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు