సత్యకు ఇచ్చిన గిఫ్ట్‌ ఆదిత్య కబోర్డ్‌లో చూసి షాకైన రుక్మిణి

1 Jun, 2021 15:00 IST|Sakshi

సత్య గదిలోకి ఆదిత్య వెళ్లడాన్ని చూసిన కనకం అక్కడే తలుపు చాటున వాళ్ల మాటలన్ని వింటుంది. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన రుక్మిణి మనసులో అనుమానం అనే బీజాన్ని బలంగా నాటుతుంది. సత్య-ఆదిత్యల గురించి ఊళ్లో నానారకాలుగా మాట్లాడుకుంటున్నారని, అనుమానం రేకెత్తిస్తుంది. ఇక రుక్మిణి తన గదిలోకి వెళ్లగానే మరో షాక్‌ తగులుతుంది. తాను స్వయంగా తయారు చేసిన కృష్ణా-రాధల బొమ్మ తన బీరువాలో చూసి ఆశ్చర్యపోతుంది. సత్యకు ఇచ్చిన బొమ్మ ఆదిత్య బీరువాలో ఉండటం చూసి అనుమానం వ్యక్తం చేస్తుంది.  ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ మే1న 247వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

దేవత సీరియల్‌ మే1 : సత్య గురించి దేవుడమ్మ అడిగే ప్రశ్నలకు తానే సమాధానం చెప్పుకుంటానని రుక్మిణి కనకంతో అంటుంది. తన చెల్లి అంటే తనకు ప్రాణం అని, తన కోసం ఏమైనా చేయడానికి సిద్ధమే అని ధీటుగా బదులిస్తుంది. సీన్‌ కట్‌ చేస్తే సత్యకు సడెన్‌గా ఎక్కిళ్లు రావడంతో పక్కన మంచినీళ్లు కోసం వెతుకుతుంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆదిత్య సత్య గదిలోకి వెళ్తాడు. నీళ్లందించి తన ఆరోగ్యం గురించి వాకబు చేస్తాడు. అయితే ఆదిత్య సత్య గదిలోకి వెళ్లడం గమనించిన కనకం వీళ్లు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని తలుపు చాటునే ఉంటుంది. ఇద్దరూ క్లోజ్‌గా మాట్లాడుకుంటున్న సమయంలో రుక్మిణి కూడా అక్కడికి వస్తే బాగుంటుందని కనకం అనుకుంటుండగానే ఆమె అక్కడికి వస్తుంది. దీన్ని అవకాశంగా మార్చుకున్న కనకం సత్య-ఆదిత్యలు చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నారని, ఒకరి యోగక్షేమాల పట్ల మరొకరు శ్రద్ధ వహిస్తున్నారని అంటుంది.

అయితే ఇది మామూలు విషయమే అని, ఆదిత్య బావ కాబట్టి కొంచెం జాగ్రత్తలు చెబుతున్నాడని రుక్మిణి జావాబిస్తుంది. అయితే సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో పాండిచ్చెరి వెళ్లి వెతికినా మీకు కనిపించలేదని, ఇప్పటికే సత్య-ఆదిత్యలపై ఊళ్లో జనాలు నానారకాలుగా మాట్లాడుతున్నారని రుక్మిణి మనసులో అనుమానపు బీజాన్ని రేకెత్తిస్తుంది. దీంతో అదే ఆలోచిస్తున్న రుక్మిణి తన గదిలోకి వెళ్లి బీరువా తెరవగా అక్కడ ఓ బొమ్మ చూసి షాకవుతుంది. అది కృష్ణ, సత్యభామల అందమైన బొమ్మ అది. అది స్వయంగా రుక్మిణి తన చేత్తో తయారుచేసి సత్యకు తాను చదువుకుంటున్న సమయంలో ఇచ్చింది. మరి అది ఇక్కడికి ఎలా వచ్చింది? సత్యను ప్రేమించి మోసం చేసింది నా పెనిమిటేనా అని రుక్మిణికి సందేహం కలుగుతుంది. ఇలా జరగకూడదని, తాను అనుకుంటుంది నిజం కాకూడదని బాధపడుతుంటుంది. మరి రుక్మిణికి సత్య-ఆదిత్యల విషయం తెలుస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. 

మరిన్ని వార్తలు