ఆండ్రియా.. భారీ పారితోషికం కూడా

28 Aug, 2022 09:16 IST|Sakshi

సంచలన దర్శకుడు మిష్కిన్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పిశాచి–2. 2014లో ఈయన దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సాధించిన పిశాచి చిత్రానికి ఇది సీక్వెల్‌. రాక్‌ఫోర్ట్‌ పతాకంపై మురుగానందం నిర్మించిన ఈ చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విజయ్‌ సేతుపతి గౌరవ పాత్రలో నటించిన ఈ చిత్రానికి కార్తీక్‌ రాజా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హారర్, థ్రిల్లర్‌ కథా చిత్రం ఈ నెల 31వ తేదీ విధులకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా నటి ఆండ్రియా ఈ చిత్రంలో పూర్తి నగ్నంగా నటించిందని, అందుకు ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్‌ చేసిందనే ప్రచారం వైరల్‌ అవుతుంది. దీనిపై దర్శకుడు మిష్కిన్‌ స్పందిస్తూ చిత్రం కోసం నటి ఆండ్రియాను నగ్నంగా చిత్రీకరించిన విషయం నిజమేనన్నారు. అందుకు ఆమె అధిక పారితోషికం డిమాండ్‌ చేయడం కూడా సహజమేనని పేర్కొన్నారు.

అయితే ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలను చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు, అవి కూడా ఆమె సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్‌తోనే తీయించామని తెలిపారు. అక్కడ తాను కూడా లేనని చెప్పారు. అయితే చిత్రాన్ని పిల్లలు కూడా చూడాలన్న ఉద్దేశంతో నగ్న ఫొటోలను చిత్రంలో పొందుపరచలేదని తెలిపారు. చిత్రంలో ఆ ఫొటోలు జత చేస్తే సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికేట్‌ ఇస్తుందని భావించి చేర్చలేదని వివరించారు.  

మరిన్ని వార్తలు