Saji Surendran: బాల్య స్నేహితురాలితో పెళ్లి, 16 ఏళ్లకు కవలలు!

15 Jul, 2021 12:20 IST|Sakshi

Mollywood Director Saji Surendran: మాలీవుడ్‌ డైరెక్టర్‌ సాజి సురేంద్రన్‌ సంతోషంలో తేలియాడుతున్నాడు. పెళ్లైన పదహారేళ్లకు అతడు తండ్రి కాబోతుండటంతో పట్టరాని ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇక ఈ విషయాన్ని అతడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించాడు. 'కొన్నిసార్లు అదృష్టం సింగిల్‌గా కాకుండా డబుల్‌డోసులో వస్తుంది. ఇద్దరు మగ కవలలు జన్మించారు, థ్యాంక్‌ గాడ్‌' అంటూ పసిబిడ్డల పాదాల ఫొటోను షేర్‌ చేశాడు. సుమారు 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత తండ్రైన ఆయనకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా సాజి తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి సంగీతను 2005లో పెళ్లి చేసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కుటుంబంలోకి కొత్త అతిథులు వస్తుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా వుంటే 'ఇవ వివాహితరాయల్‌' అనే మలయాళ సినిమాతో 2009లో దర్శకుడిగా కెరీర్‌ మొదలు పెట్టాడు సాజి. అనంతరం 'ఫోర్‌ ఫ్రెండ్స్‌', 'కుండలియన్‌', 'షి టాక్సీ' చిత్రాలను రూపొందించాడు.

మరిన్ని వార్తలు