Saravanan Arul: ట్రోల్స్‌పై స్పందించిన ‘ది లెజెండ్‌’ హీరో శరవణన్‌

5 Mar, 2023 08:59 IST|Sakshi

తమిళ సినిమా: లెజెండ్‌ శరవణన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ వ్యాపార వేత్త, శరవణా స్టోర్స్‌ సంస్థల అధినేత అయిన ఈయన, ఆర్‌ సంస్థల ప్రచార చిత్రాల ద్వారా బహుళ ప్రాచుర్యం పొందాయి. ఆ ప్రచార చిత్రాల్లో బాలీవుడ్, సౌత్‌ ఇండియన్‌ హీరోయిన్లతో డాన్స్‌ చేసి సాధారణ ప్రజలకు దగ్గరయ్యారు. తరువాత ఆయన సినిమాలపై గురిపెట్టారు. అలా ది లెజెండ్‌ చిత్రం ద్వారా  కథానాయకుడిగా పరిచయం అవ్వడంతో పాటు నిర్మాతగానూ అడుగు పెట్టారు.

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌథేలా ఇందులో హీరోయిన్‌గా నటించారు. భారీ బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. శుక్రవారం నుంచి డిస్నీ హాట్‌ స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా తనకు ప్రారంభ దశ నుంచి ప్రచార మీడియా పెద్ద సపోర్ట్‌గా నిలిచిందన్నారు. అదే విధంగా తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ది లెజెండ్‌ విడుదలై మిశ్రమ స్పందనతో ప్రదర్శిత మవుతోందన్నారు.

ఆ చిత్రానికి విమర్శల ద్వారా మీ విశ్లేషణలను తమ మీడియా ద్వారా పొందుపరిచారన్నారు. కొందరు వ్యక్తిగతం గానూ, ఫోన్‌ చేసి చెప్పారన్నారు. విమర్శలే విజయానికి తొలిమెట్టుగా భావించి తాను ముందడుగు వేస్తున్నానన్నారు. కాగా తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తొలి ప్రయత్నంగా సామాజిక పరమైన అంశంతో కుటుంబ కథాచిత్రంలో నటించిన లెజెండ్‌ శరవనన్‌ ఈ సారి రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు