Sai Dharam Tej Accident: అర‌బిందో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి భారీ జరిమానా!

15 Sep, 2021 08:35 IST|Sakshi

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ గత శుక్రవారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు పేర్కొన్నారు. కాగా కేబుల్‌ బ్రిడ్జ్‌ మీదుగా మాదాపూర్‌ వైపు వెళ్తుండగా సాయి తేజ్‌ ఐకియా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.రోడ్డుపై అరబిందో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి సంబంధించి మట్టి, వ్యర్థాలు ఉండటం వల్లే తేజ్ బైక్‌ స్కిడ్ అయి పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కన్‌స్ట్రక్షన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెళ్లుతెత్తాయి. ఇందులో భాగంగానే ఖానమేట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్ కంపెనీపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) రూ.లక్ష జరిమానా విధించింది .

చదవండి: Sai Dharam Tej Accident: కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి: ఆర్పీ

సదరు కంపెనీకి లక్ష రూపాయల జరిమాన విధించిన జీహెచ్‌ఎంసీ ధృవీకరణ పత్రం సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది.కాగా ఈ ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన ఆయన కాలర్‌ బోన్‌ ఫాక్చర్‌ కాగా ఆదివారం వైద్యులు దానికి శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం అపోలో వైద్యులు సాయి ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తూ.. ప్రస్తుతం అతడి అరోగ్యం నిలకడ ఉందని, త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. 

మరిన్ని వార్తలు