Ram Charan: సినిమా స‌రిహ‌ద్దుల‌ను చెరిపేస్తాం: రామ్‌ చరణ్‌

25 May, 2023 15:48 IST|Sakshi

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చరణ్‌ మరో ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించారు. తన స్నేహితుడు విక్రమ్‌తో కలిసి వీ మెగా పిక్చర్స్‌ అనే ప్రొడక్షన్‌ హౌస్‌ను స్టార్ట్ చేశారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ విక్రమ్‌ (విక్కీ), రామ్‌ చరణ్‌ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లుగా కూడా వ్యవహరిస్తున్నారు.

(ఇది చదవండి: రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌)

అలాగే రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. 2017లో స్థాపించిన ఈ సంస్థ  ఖైదీ నం.150 వంటి హిట్‌ సినిమాలను అందించింది. తాజాగా ప్రారంభించిన వీ మెగా పిక్చర్స్‌ బ్యానర్‌పై తీయనున్న చిత్రాల్లో కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వనున్నారు. యంగ్‌ టాలెంటెడ్ నటీనటులకు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించేందుకు ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘మా వి మెగా పిక్చర్స్’ బ్యానర్ విలక్ష‌ణ‌మైన ఆలోచనలను ఆవిష్క‌రిస్తూ స‌రికొత్త‌, వైవిధ‌మ్యైన వాతావ‌ర‌ణాన్ని పెంపొందించ‌టానికి సిద్దంగా ఉన్నాం. సృజ‌నాత్మ‌క‌త‌తో సినిమా స‌రిహ‌ద్దుల‌ను చెరిపేస్తాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసి ఓ  స‌రికొత్త ప్ర‌భావాన్ని చూపించ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాం.' అన్నారు. 

యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ ..'ఈ స‌రికొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌టం అనేది మాలో తెలియ‌ని ఆనందాన్ని క‌లిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో క‌లిసి "వి మెగా పిక్చ‌ర్స్" ప‌ని చేయ‌నుంది. వెండితెర‌పై చూపించ‌బోయే స్టోరీ టెల్లింగ్‌లో ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకు రావాల‌నుకుంటున్నాం. దీని వ‌ల్ల సినీ ఇండ‌స్ట్రీ హ‌ద్దులు చెరిపేయ‌ట‌మే మా ల‌క్ష్యం.' అన్నారు.

ఈ విషయం తెలుసుకున్న రామ్‌ చరణ్‌ అభిమానులు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. కాగా.. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా చెర్రీ పాల్గొన్నారు. ఇండియా సినిమా గురించితన ఆలోచనలను పంచుకునే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 


(ఇది చదవండి: భర్తకు విడాకులిచ్చిన బుల్లితెర నటి? ఫోటోతో క్లారిటీ!)

మరిన్ని వార్తలు