Harshaali Malhotra: 'భజరంగీ భాయిజాన్‌' మున్నీకి ప్రతిష్టాత్మక అవార్డు.. వారికి అంకితం

11 Jan, 2022 21:24 IST|Sakshi

Harshaali Malhotra Receives Bharat Ratna Dr Ambedkar Award: ఆంజనేయ స్వామి భక్తుడిగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన మూవీ 'భజరంగీ భాయిజాన్‌'. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 2015లో విడుదలైన ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథ సహకారం అందించారు. స్టార్‌ డైరెక్టర్‌ కబీర్ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటీనటుల యాక్టింగ్‌కు ఫిదా కావాల్సిందే. అందులో ముఖ్యంగా మున్నీగా అలరించిన హర్షాలీ మల్హోత్ర మైండ్‌లో నుంచి పోదు. అంతలా ఆకట్టుకుంది చిన్నారి హర్షాలీ. తాజాగా హర్షాలీకి అరుదైన గౌరవం దక్కింది. 
 

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03)

13 ఏళ్ల హర్షాలీని మహరాష్ట్ర ప్రభుత్వం 'భారతరత్న డా. బీఆర్‌ అంబేడ్కర్' అవార్డుతో సత్కరించింది. ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్‌ కొష్యారీ నుంచి ఈ పురస్కారాన్ని అందుకుంది ఈ బాల నటి. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా అయిన ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా షేర్‌ చేసుకుంది. ఈ బహుమతిని సల్మాన్‌ ఖాన్‌, కబీర్‌ ఖఆన్‌, చిత్ర నిర్మాతలకు అంకితం ఇస్తున్నట్లుగా పోస్ట్‌ పెట్టింది హర్షాలీ. ఈ పోస్ట్‌కు అనేకమంది నెటిజన్స్ స్పందించారు. హర్షాలీని చూస్తుంటే గర్వంగా ఉందని, ఇలాంటి విజయాలు మరెన్నో దక్కాలని కోరారు. 'మున్ని ఈ అవార్డు నీది మాత్రమే. ఎందుకంటే నీ యాక్టింగ్‌తోనే ఈ అవార్డు గెలుచుకున్నావ్‌' అని ఒక యూజర్‌ అభిమానం చూపించారు. ఇదిలా ఉంటే 'భజరంగీ భాయిజాన్‌' సినిమా సమయంలో హర్షాలీకి ఎనిమిదేళ్లు.  
 

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03)


ఇదీ చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్‌ ఫిదా.. జాన్వీ కపూర్‌ ప్రశంసలు

మరిన్ని వార్తలు