ఆ డైలాగ్‌ ఎలా రాశారో తెలియదు..నా మాటే జీవిత వింటుంది: రాజశేఖర్‌

5 Dec, 2023 11:55 IST|Sakshi

టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్‌ లిస్ట్‌లో మొదటి వరుసలో ఉంటారు జీవిత, రాజశేఖర్‌. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇంట్లో ఎక్కువగా జీవిత డామినేషనే ఉంటుందని టాలీవుడ్‌ టాక్‌. జీవిత ఎలా చెబితే అలా రాజశేఖర్‌ చేస్తారని, అందుకే వారి మధ్య గొడవలు జరగవని అంటుంటారు. ఇదే విషయాన్ని ఎక్‌ట్రా ఆర్డనరీ మ్యాన్‌ సినిమాలో ఒక్క డైలాగ్‌తో చెప్పించాడు దర్శకుడు వక్కంతం వంశీ. నితిన్‌, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్‌ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ‘నాకు జీవిత, జీవితం రెండూ ఒక్కటే’ అని రాజశేఖర్‌ చెప్పే డైలాగ్‌ బాగా వైరల్‌ అయింది.

(చదవండి: రేవంత్‌ రెడ్డి ఫోటో షేర్‌ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత)

తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో రాజశేఖర్‌ ఈ డైలాగ్‌ గురించి మాట్లాడుతూ..‘ జీవిత, జీవితం రెండూ ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు ఎలా రాశారో తెలియదు కానీ.. బాగా సక్సెస్‌ అయింది. ‘జీవిత కూర్చో అంటే కూర్చుంట..లే అంటే లేస్తాను’ అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్‌ రాసినట్లు ఉన్నాడు. వాస్తవానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. చాలా మంచిది. ఒక్క మాట కూడా తిరిగి అనదు. కానీ అందరూ జీవిత చెప్తే నేను ఆడతాను అని అనుకుంటున్నారు. జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె చెప్పేది నా మంచి కోసమే’ అని రాజశేఖర్‌ చెప్పుకొచ్చాడు.

ఇక జీవిత మాట్లాడుతూ.. ‘భార్యభర్తలు అంటూ ఒకరి మాట ఒకరు వినాలి.. ఒకరి గురించి ఇంకొకరు బతకాలి.. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మేం ఇద్దరం ఒకరికొకరం బతుకుతాం. నాకు నా భర్త.. ఇద్దరు కూతుళ్లు..వీళ్లే ప్రపంచం. వీళ్ల కోసం ఎవరినైనా ఎదిరిస్తాను. మంచి పాత్ర దొరికితే రాజశేఖర్‌  విలన్‌‌గా అయినా, ఓ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారు’ అన్నారు.

>
మరిన్ని వార్తలు