మళ్లీ థియేటర్లలోకి హాలీవుడ్ బ్లాక్‌ బ్లస్టర్‌ 'ది మ్యాట్రిక్స్‌'.. కారణం ?

22 Nov, 2021 14:13 IST|Sakshi

Hollywood Film The Matrix Re Releasing On December 3: హాలీవుడ్‌ బ్లాక్‌ బ్లస్టర్‌ చిత్రం 'ది మ్యాట్రిక్స్‌'. స్కై-ఫై, యాక్షన్‌ తరహాలో వచ్చిన ఈ సినిమాకు ఇండియాలో మంచి ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉంది. 1999లో వచ్చిన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందులోని నియో (కీను రీవ్స్‌), ట‍్రినిటీ (క్యారీ-అన్నె మోస్‌), మార్ఫస్‌ (లారెన్స్‌ ఫిష్‌బర్న్‌) పాత్రలు ఇప్పటికీ గుర్తిండిపోతాయి. అంతలా ఆకట్టుకుంటాయి ఆ పాత్రలు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్‌. ఈ చిత్రాన్ని మళ్లీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపింది నిర్మాణ సంస్థ. అయితే మ్యాట్రిక్స్‌ సిరీస్‌లోని నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్' డిసెంబర్ 22న విడుదల కానుంది. 

ఈ సిరీస్‌లో కథానాయకుడి గతానికి సంబంధించిన కథతో వస్తోంది 'ది మ్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్'. మొదటి చిత్రం విడుదలకు నాలుగో సినిమా విడుదలకు మధ్య 12 ఏళ్లు గ్యాప్‌ ఉంది. అయితే నాలుగో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్‌ కావడానికే ఈ ఫ్రాంచైజీలోని మొదటి చిత్రమైన 'ది మ‍్యాట్రిక్స్‌' రిలీజ్‌ చేయనున్నారో తెలియాల్సి ఉంది. మ్యాట్రిక్స్‌ చిత్రానికి లానా వాచోస్కీ, లిల్లీ వాచోస్కీ దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్‌ నాలుగో చిత్రానికి మాత్రం లానా వాచోస్కీ ఒక్కరే రచన, దర్శకత్వం వహించారు. 'ది మ్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్' చిత్రంలో గ్లొబల్‌  స్టార్‌ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్‌ కామెంట్‌

మరిన్ని వార్తలు