‌తమిళ రీమేక్‌ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్

27 Mar, 2021 09:47 IST|Sakshi

పోలీసు ఆఫీసర్‌గా‌ సైఫ్‌ అలీఖాన్‌ అరెస్ట్‌ చేయాలనుకుంటున్న గ్యాంగ్‌స్టర్‌ దొరికాడు. హృతిక్‌ రోషనే ఆ గ్యాంగ్‌స్టర్‌. తమిళ హిట్‌ ‘విక్రమ్‌ వేదా’ హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ మూవీని డైరెక్ట్‌ చేసిన పుష్కర్‌-గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నారు. ఓ పోలీసు ఆఫీసర్, గ్యాంగ్‌స్టర్‌ మధ్య సాగే కథే ‘విక్రమ్‌ వేదా’. తమిళంలో మాధవన్‌  చేసిన పోలీస్‌ విక్రమ్‌ పాత్రను హిందీలో సైఫ్‌ అలీఖాన్‌  చేయనున్నారు. గ్యాంగ్‌స్టర్‌ వేదా పాత్రకు హృతిక్‌ రోషన్‌  ఓకే చెప్పినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు