Nandamuri Kalyan Ram: కల్యాణ్‌రామ్ 'డెవిల్'.. ఆ రోజులు గుర్తుకు రావాల్సిందే!

4 Sep, 2023 14:12 IST|Sakshi

అమిగోస్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం డెవిల్. ‘ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్  హీరోయిన్‌గా నటిస్తోంది. నవీన్  మేడారం దర్శకత్వంలో అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: బాలీవుడ్‌లో ఆ సత్తా ఎవరికీ లేదు.. సౌత్‌లో అతనొక్కడే: ఎన్టీఆర్‌పై గదర్ డైరెక్టర్)

ఈ మూవీ షూటింగ్‌ కోసం భారీ సెట్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 1940 కాలం స్టోరీ కావడంతో అందుకు తగినట్లుగానే షూటింగ్‌ సెట్‌ను రూపొందించారు. ఆ కాలం నాటి పరిస్థితులు కళ్లముందు కనిపించేలా డిజైన్‌ చేశారు. బ్రిటీష్ కాలంలో సెట్స్ వేయటం తనకెంతో ఛాలెంజింగ్‌గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు. మన దేశం ఉన్నసయమానికి చెందిన తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ కోసం కావాల్సిన సామాగ్రిని ప్రత్యేకంగా తెప్పించారు. ఈ సెట్స్ చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకు హర్షవర్థన్  రామేశ్వర్‌ సంగీతమందిస్తున్నారు.ఈ సినిమాను నవంబరు 24న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. 

'డెవిల్' మూవీ కోసం వేసిన సెట్స్ .. వాటి విశేషాలు...

* 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్
* బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు
* బ్రిటీష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు
* 1940 కాలానికి చెందిన కార్గో షిప్
* 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ (వైజాగ్ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో)

అయితే ఈసెట్స్ వేయడానికి మొత్తం 9 ట్రక్కుల కలపను తెప్పించారు. వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్‌ను ఉపయోగించారు. 

మరిన్ని వార్తలు