వివాహం, విడాకులు రెండూ కష్టమే: నటుడి భార్య

21 Oct, 2020 10:44 IST|Sakshi

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ తన భార్య అవంతిక మాలిక్‌ నుంచి విడిపోయినట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల ఇమ్రాన్, అవంతిక మధ్య విబేధాలు తలెత్తడంతో ఈ జంట విడిపోతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. 35 ఏళ్ల ఇమ్రాన్  ఎనిమిది సంవత్సరాల క్రితం అవంతికను వివాహం చేసుకున్నాడు. ఇక గత సంవత్సరం నుంచి అవంతిక తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల అవంతిక మాలిక్ తన కుమార్తె పుట్టినరోజును ఇమ్రాన్ ఖాన్ లేకుండా జరుపుకోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: కంగనాకు అత్యాచార బెదిరింపు..

కాగా అవంతిక విడాకుల విషయంపై ఆమె తల్లి స్పందించారు. ఇమ్రాన్‌తో తన కూతురు వీడిపోతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. అవన్నీ పుకార్లని, అలాంటిదేమైనా ఉంటే ఖచ్చింగా తెలియజేస్తామని అన్నారు. అయితే కొన్ని విభేధాలు న్నాయని, ఎప్పటికైనా అవి సర్దుమనుగాతమన తెలిపారు. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేశారు. జీవితంలో పోరాడేందుకు ఎలాంటి విషయాలను ఎంచుకోవాలనే దానిపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ఇందుకు ఆమె డెవాన్‌ బ్రో రచయిత కవిత్వాన్ని రీపోస్టు చేస్తూ ‘ట్రూత్‌ బాంబ్‌ అని పేర్కొన్నారు. చదవండి: ఆ మాటలకు నా ఇగో హర్ట్‌ అయ్యింది: జెనీలియా భర్త

వివాహం అనే బంధం కష్టం, విడాకులు తీసుకోవడమూ కష్టమే.. ఏది కావాలో ఎంచుకోండి. బద్దకంగా ఉండటం కష్టం, ఫిట్‌గా ఉండటం కష్టం. ఎలా ఉండాలో ఎంచుకోండి.. అప్పుల్లో ఉండటం కష్టం, ఆర్టికంగా ఉన్నతంగా ఉండటం కష్టం.. ఎలా ఉండాలో నిర్ణయించుకోండి.. కమ్యూనికేషన్ చేయడం కష్టం,  కమ్యూనికేట్ చేయకపోవడం కష్టం. ఏది కావాలో తెలుసుకోండి. జీవితం ఎప్పటికీ సులభం కాదు. ఎల్లప్పుడూ కఠినంగా ఉంటుంది. కానీ మనకు కావాల్సింది  ఎంచుకోవచ్చు. తెలివిగా ఆలోచించండి’. అంటూ పేర్కొన్నారు. ఇక ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. మనం ఇష్టపడే వారి కోసం పోరాడాలని, ఎల్లప్పూడు సంతోషంగా ఉండాలని సూచిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు