Kareena Kapoor: ఏ స్టార్‌ హీరోయిన్‌కు సాధ్యం కానీ రికార్డ్.. కరీనాకు మాత్రమే!

5 Sep, 2023 18:48 IST|Sakshi

ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌ హోదా రావాలంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అంతా ఈజీ కాదు. ఒక్క సూపర్‌ హిట్‌ పడినా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాంటే అదృష్టం కూడా ఉండాలి. అలా బాలీవుడ్‌లో స్టార్స్ హీరోయిన్స్‌ ఎందరో ఉన్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌లో అగ్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్ అందుకున్న వారు చాలా తక్కువమందే ఉంటారు. కానీ ఇలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న నటీమణుల్లో మొదట వినిపించే పేరు ఆమెదే. హిందీ చిత్రసీమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన హీరోయిన్ కరీనా కపూర్. ఆమె సాధించిన ఘనతలపై ఓ లుక్కేద్దాం. 

(ఇది చదవండి: డైరెక్టర్‌ ముద్దుపై తొలిసారి రియాక్ట్‌ అయిన మన్నారా చోప్రా)

ఆమె చిత్రాలే టాప్

బాలీవుడ్‌లో కరీనా కపూర్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు.  బాలీవుడ్ చరిత్రలో మరే ఇతర హీరోయిన్ల సినిమాలు ఆమెను అధిగమింలేకపోయాయి. అంతలా ఆమె చిత్రాలు సక్సెస్ సాధించాయి. కరీనా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.4 వేల కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయంటే ఆ రేంజ్ ఏంటో అర్థమవుతోంది. ఆమె నటించిన 23 సూపర్‌ హిట్‌ సినిమాల కలెక్షన్స్ చూస్తే బాలీవుడ్ స్టార్స్ కరిష్మా, కత్రినా, రాణి ముఖర్జీ,  కాజోల్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకొనే సైతం దారిదాపుల్లో కూడా లేరు. 

అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్‌గా...

కరీనా నటించిన 23 చిత్రాల్లో బజరంగీ భాయిజాన్, 3 ఇడియట్స్  ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. బజరంగీ భాయిజాన్ ఒక్కటే ప్రపంచ వ్యాప్తంగా రూ.918 కోట్లు వసూలు చేసింది. అలాగే కభీ ఖుషీ కభీ ఘమ్, ఐత్రాజ్, జబ్ వి మెట్, బాడీగార్డ్, గుడ్ న్యూజ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సూపర్ హిట్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.4000 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టాయి. దక్షిణాదిలో హీరోయిన్లతో పోలిస్తే సమంత, నయనతార, అనుష్క శెట్టి సినిమాలకు సైతం ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రాలేదు. 

(ఇది చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!)

ఆ లిస్ట్‌లోని హీరోయిన్స్ వీళ్లే

అయితే కరీనా తర్వాత రూ. 3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోయిన్లలో దీపికా పదుకొణె, అనుష్క శర్మ ఉన్నారు. దక్షిణాదిలో అయితే అనుష్క శెట్టి, తమన్నా భాటియా బాహుబలి చిత్రంతో ఈ జాబితాలోకి వచ్చారు.  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 2400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత రూ.2000 కోట్లకు పైగా లిస్ట్‌లో ఐశ్వర్య రాయ్, అలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, నయనతార నిలిచారు. అంతే కాకుండా ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా కూ.2024 కోట్ల రూపాయలు వసూలు చేసిన దంగల్‌ చిత్రం ద్వారా ఈ జాబితాలోకి వచ్చారు.

మరిన్ని వార్తలు