చిన్నప్పుడు అనుకున్నదే ఇప్పుడు నిజమైంది: ఆనందిత

5 Dec, 2021 14:14 IST|Sakshi

‘పెద్దయ్యాక  ఏమవుతావ్‌?’ అని అడిగే ప్రశ్నకు.. చిన్నప్పుడు చెప్పే సమాధానానికి భవిష్యత్‌ మనల్ని నిలబెట్టే తీరుకి అసలు సంబంధమే ఉండదు చాలా వరకు. కానీ ఆనందిత విషయంలో మాత్రం అలా జరగలేదు. చిన్నప్పుడు  నటిగా మారతానని సమాధానం చెప్పింది. మారింది. ప్రస్తుతం వరుస సిరీస్‌లు చేస్తూ వెబ్‌స్టార్‌గా వెలుగుతోంది. 

తల్లిదండ్రులు దీప పాగ్నిస్, సునీల్‌ పాగ్నిస్‌. 

   కుటుంబంలో అందరికంటే చిన్నది కావడంతో గారాబంగా పెరిగింది.  అదే తనని పట్టువదలని విక్రమార్కురాలిని చేసింది. 

► ముద్దుగా, బొద్దుగా ఉన్న తనని చూసిన ఓ డైరెక్టర్, పద్నాలుగేళ్ల వయసులోనే బుల్లితెరకు పరిచయం చేశాడు. ఇక అప్పుడే నిర్ణయించుకుంది నటిని కావాలని. 

► పట్టిన పట్టు విడువని ఆనందిత ఒకవైపు చదువు కొనసాగిస్తూనే.. మోడల్‌గా మారి, ఎన్నో వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించింది. 

► తల్లిదండ్రుల కోరిక మేరకు కొంతకాలం విరామం తీసుకొని, ముంబైలోని ఉషా ప్రవీణ్‌ గాంధీ కాలేజీలో డిగ్రీ చేసింది. 

► వరుస ప్రకటనల్లో నటిస్తూ.. తన లక్ష్యంపై దృష్టి సారించి టీవీ సీరియల్‌లో నటించే అవకాశాన్ని సంపాదించింది. 

► 2015లో ‘దిల్‌ సంభల్‌ జా జరా’ సీరియల్‌తో పరిచయమై, వరుసగా ‘ది స్టూడియా షో’, ‘ది ఆఫీస్‌’  వంటి షోలు, సిరీస్‌లు చేస్తూ బిజీ యాక్ట్రెస్‌గా మారింది. 

► ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారమవుతోన్న  ‘మైండ్‌ ది మల్హోత్రాస్‌’ సిరీస్‌తో అలరిస్తోంది. 

అనుకున్నదే అయింది
చిన్నప్పుడు కెమెరా ముందు నటించడం సరదాగా అనిపించింది. కానీ, నిజానికి చాలా కష్టం. త్వరలోనే సినిమాల్లో కూడా నటిస్తా.
– ఆనందిత పాగ్నిస్‌ 

మరిన్ని వార్తలు