అందులో నేను అంధురాలిని: హీరోయిన్‌

19 Mar, 2021 08:26 IST|Sakshi

‘ప్రేమ కావాలి, పూలరంగడు’ ఫేమ్‌ ఇషా చావ్లా లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘అగోచర’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కబీర్‌ లాల్‌ ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. ఇషా చావ్లా భర్త పాత్రలో నటుడు కమల్‌ కామరాజు నటిస్తున్నారు. లవ్లీ వరల్డ్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం డెహ్రాడూన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఇషా చావ్లా మాట్లాడుతూ– ‘‘కబీర్‌ లాల్‌ చాలా కాలంగా నాకు తెలుసు. ఆయన చెప్పిన కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పేశాను. ఇందులో అంధురాలి పాత్ర చేస్తున్నాను. ఇలాంటి పాత్ర కోసమే ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాను. ఈ పాత్ర చేయడం మానసికంగానే కాకుండా ఎమోషనల్‌గా కూడా ఛాలెంజింగ్‌గా ఉంది’’ అన్నారు.

కబీర్‌ లాల్‌ మాట్లాడుతూ– ‘‘మర్డర్‌ మిస్టరీగా రూపొందుతోన్న చిత్రం ‘అగోచర’. ఒక ఘటనతో జీవితాలు ఎలా మారిపోయాయి? అనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ చిత్రంలో ఇషా చావ్లా ఒక భిన్నమైన పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనుంది. ఆమెకు మద్దతు ఇచ్చే భర్త సైకాలజిస్ట్‌ పాత్రలో కమల్‌ కామరాజు నటిస్తున్నారు. జూన్‌లో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. బ్రహ్మానందం, సునీల్‌ వర్మ, అజయ్‌ కుమార్‌ సింగ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

చదవండి: స్టోరీ టెల్లింగ్‌ అద్భుతంగా ఉంది: చిరంజీవి
∙ఇషా చావ్లా 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు