ఓటీటీపై ఆంక్షలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన నటి

27 Mar, 2021 17:36 IST|Sakshi

ఈ మధ్యకాలంలో ఓటీటీ వినియోగం బాగా పెరిగింది. చిన్న సినిమాలు మొదలుకొని స్టార్‌ నటీనటులు కూడా ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నారు. అయితే సినిమాల్లో ఉ‍న్నట్లు డిజిటల్‌  ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణ లేదు. దీంతో ఓటీటీ(ఓవర్‌ ద టాప్‌) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిబంధనావళిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ కంటెంట్‌  నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గైడ్‌లైన్స్‌పై నటి రాధికా ఆప్టే అభ్యంతరం​ వ్యక్తం చేసింది.

'ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఇప్పుడు  ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ట్రెండ్‌ నడుస్తుంది. దీన్ని వల్ల ఎన్నో కొత్త ఆలోచనలు ప్రేక్షకులకు చేరుతున్నాయి. అంతేకాకుండా ఓటీటీ వల్ల చాలా మంది ఉపాధి అవకాశాలు లభించాయి. గత కొన్నాళ్లుగా ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. ఇదా చాలా అద్భుతమైన ప్లాట్‌పామ్‌. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలు భయానకంగా ఉన్నాయి. మున్ముందు ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి' అని అసహనం వ్యక్తం చేసింది. కాగా అందాల ఆరబోతకు వెనకాడని రాధికా ఆప్టే ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రాధికా ఆప్టే బాత్రూం సీన్లలో కనిపించిన వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. 

చదవండి : ఓటీటీలపై నిఘా
పెళ్లి ఇష్టం లేదు, కానీ దానికోస‌మే చేసుకున్నా

మరిన్ని వార్తలు