KCR Movie: ఎన్నికల ఎఫెక్ట్.. ఇప్పట్లో ఆ సినిమా రిలీజ్ కష్టమే!

14 Nov, 2023 16:47 IST|Sakshi

'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్.. ప్రస్తుతం 'కేసీఆర్' అని ఓ సినిమా తీస్తున్నాడు. అయితే ఇది తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ లేదంటే వేరే ఏదైనా స్టోరీనా అనేది పెద్దగా రివీల్ చేయలేదు. సరే అదంతా పక్కనబెడితే ఈ నవంబరులోనే సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విషయమై నటుడు-నిర్మాత రాకేశ్ ఎమోషనల్ అయ్యాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!)

అసలేం జరిగింది?
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అన్ని పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. మరోవైపు జబర్దస్త్ కమెడియన్ రాకేశ్ 'కేసీఆర్'(కేశవ్ చంద్ర రమావత్) పేరుతో సినిమా తీస్తున్నాడు. అయితే ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయొద్దని సెన్సార్ ఆపేసింది. ఇప్పుడు దాని గురించే చెబుతూ రాకేశ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  అలానే కొందరికి తను బినామీగా వ్యవహరిస్తున్నాననే వార్తలపైనా క్లారిటీ ఇచ్చేశాడు.

రాకేశ్ ఏమన్నాడు?
'ఈ సినిమాని అనుకున్న టైంకే రిలీజ్ చేద్దామని పక్కా ప్లాన్ వేసుకున్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. ఇది బయోపిక్కా? ఏ జానర్ అనేది రివీల్ చేయడం లేదు. సెన్సార్ వాళ్లకే అన్నీ వివరించాను. ఎన్నికల కోడ్ ప్రకారం ఈ మూవీని ఇప్పుడు విడుదల చేయకూడదట. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్నాను. పబ్లిసిటీకి టైం దొరికిందని అనుకుంటాను. అలానే నాకు ఎవరు డబ్బులిచ్చి ఈ సినిమాని చేయమని చెప్పలేదు. ప్యాషన్ తో ఈ సినిమా తీస్తున్నా. మీరు గౌరవిస్తారని కోరుకుంటున్నాను' అని రాకేశ్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)

A post shared by Rocking Rakesh (@jabardasthrakesh)

మరిన్ని వార్తలు