అసిస్టెంట్‌, డ్రైవర్‌తో కలిసి రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ తిన్న జగ్గూభాయ్‌

29 Jul, 2021 10:30 IST|Sakshi

చెన్నై : ఒకప్పుడు స్టార్‌ హీరోగా పేరు సంపాదించుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్‌ పాత్రలతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ ఇండస్ర్టీల నుంచి జగ్గూబాయ్‌కి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగా జగపతి బాబు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారాయన.

తాజాగా తమిళనాడులోని ఓ హైవే పక్కన ధాబాలో తన అసిస్టెంట్‌, డ్రైవర్‌తో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న సెల్ఫీని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 'చాలా రోజుల తర్వాత ఇలా హైవే పక్కన నా డ్రైవర్‌ రాజు, అసిస్టెంట్‌ చిరూతో ఫుడ్‌ని ఆరగించాను' అంటూ జగపతి బాబు షేర్‌చేసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ సంప్లిసిటీకి హ్యాట్సాఫ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

మరిన్ని వార్తలు