ఆయన దయ వల్లే ఈ హోదా – జానీ మాస్టర్‌ 

20 Oct, 2023 03:37 IST|Sakshi
అతిథుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న జానీ మాస్టర్‌ 

‘‘ఈ రోజు మాకు (డ్యాన్స్‌ మాస్టర్స్‌) ఇంత పేరు, హోదా వచ్చి కార్లలో తిరుగుతున్నామంటే ముక్కురాజు మాస్టర్‌ దయే. ‘తెలుగు ఫిలిం అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌– డ్యాన్స్ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌’ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే కారణం కూడా ఆయనే. యూనియన్‌ తరఫున ఆయన వారసురాలికి చిరు కానుకగా రెండు లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అని ‘తెలుగు ఫిలిం అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌– డ్యాన్స్ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌’ నూతన అధ్యక్షుడు జానీ మాస్టర్‌ అన్నారు.

‘తెలుగు ఫిలిం అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌– డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌’ అధ్యక్షుడిగా జానీ మాస్టర్‌ ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఆయన ప్రమాణ స్వీకారానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు, ఫిల్మ్‌ ఛాంబర్‌ సెక్రటరీ కేఎల్‌ దామోదర ప్రసాద్‌ విశిష్ఠ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘నూతన కార్యవర్గం యూనియన్‌ సభ్యుల మంచి కోసం పని చేయాలి.

జానీ ప్రమాణ స్వీకారానికి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి డ్యాన్స్ మాస్టర్లు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా యూనియన్‌ సొంత స్థలం, భవనం కోసం కృషి చేస్తా’’ అన్నారు జానీ మాస్టర్‌. ఈ కార్యక్రమంలో మద్రాస్‌ డ్యాన్స్ యూనియన్‌ ప్రెసిడెంట్‌ దినేష్‌ మాస్టర్, పలువురు డ్యాన్స్‌ మాస్టర్స్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు