Abu Rakaba Killed:హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ హతం?

28 Oct, 2023 13:47 IST|Sakshi

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 22వ రోజున ఇజ్రాయెల్ సైన్యం తాము భారీ విజయాన్ని సాధించినట్లు ప్రకటించింది. హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అబు రకాబాను సైన్యం హతమార్చిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడికి రకాబా ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, దాని అధికారిక ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో ఒక పోస్ట్ చేస్తూ, హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అబు రకాబా హత్యను ధృవీకరించింది. అక్టోబరు 7న జరిగిన మారణకాండను ప్లాన్ చేయడంలో రకాబా కీలక పాత్ర పోషించాడని, అతను పారాగ్లైడర్‌లపై ఇజ్రాయెల్‌లోకి చొరబడి, ఉగ్రవాదులకు ఆజ్ఞలు జారీ చేశాడని, డ్రోన్ దాడులకు బాధ్యుడని ఇజ్రాయెల్‌ పేర్కొంది. 

అక్టోబర్ 7 న హమాస్ జరిపిన దాడిలో 1400 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చేతిలో బందీలుగా మారారు. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించి, హమాస్ స్థానాలపై దాడి చేస్తూ వస్తోంది.

హమాస్‌ను పూర్తిగా నిర్మూలించిన తర్వాతే ఊపిరి పీల్చుకుంటామని ఇజ్రాయెల్ మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ మాట్లాడుతూ హమాస్‌ను అంతమొందించాలని ఇజ్రాయెల్ భావిస్తోందన్నారు. 
ఇది కూడా చదవండి: జైలులో రావణ దహనం.. నలుగురు అధికారులు సస్పెండ్‌!
 

మరిన్ని వార్తలు