సిద్ధార్థ్‌ శుక్లా మృతి: ఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్‌ బ్యూటీ

7 Sep, 2021 10:42 IST|Sakshi

Jasleen Matharu Hospitalised After Sidharth Shuklas Death: బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ శుక్లా హఠాన్మరణం కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. 40 ఏళ్ల సిద్ధార్థ్‌ తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శుక్లా మరణించినట్లు ముంబైలోని కూపర్‌ ఆసుపత్రి ధృవీకరించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్‌ మరణాన్ని సహ నటులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా ఆయన ప్రేయసి షెహనాజ్‌ గిల్‌ విలపించిన తీరు వర్ణనాతీతం. అంత్యక్రియలకు హాజరైన షెహనాజ్‌ ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. మరోవైపు సిద్ధార్థ్‌ మరణ వార్త విని ఓ అభిమాని ఇటీవలె ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
చదవండి: 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు'

తాజాగా  'ముజ్సే షాదీ కరోగి' రియాలీటీలో సిద్ధార్థ్‌ శుక్లా కలిసి పని చేసిన, బిగ్‌బాస్‌ 12 పార్టిసిపెంట్‌ జస్లీన్‌ మాతరు ఆసుపత్రి పాలైంది. తీవ్రమైన జ్వరంతో ఆమె ఆసుపత్రిలో చేరినట్లు స్వయంగా ఆమె ఓ సెల్ఫీ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌చేసింది.  సిద్ధార్థ్‌ శుక్లాకు సంతాపంగా చేసిన పోస్ట్‌కి ఓ నెటిజన్‌ నుంచి ఊహించని విధమైన కామెంట్స్‌ రావడంతో  భయబ్రాంతులకు లోనై ఈ పరిస్థితుల్లో ఉన్నానంటూ వీడియోలో పేర్కొంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  "సిద్ధార్థ్‌ చనిపోయిన వార్త విన్న వెంటనే షాక్‌లోనే అతని ఇంటికి వెళ్లాను. అక్కడి పరిస్థితులు నన్ను ఎంతో కలవరపరిచాయి. షెహనాజ్‌, రీతూ ఆంటీ (సిద్ధార్థ్‌ తల్లి)ని కలిసి ఇంటికి తిరిగి వచ్చాను. అనంతరం ఇంటికి వచ్చాక సోషల్‌ మీడియాలో వచ్చిన మేసేజ్‌లు చూసుకుంటుండగా.. అందులో ఓ వ్యక్తి నుంచి ఓ భయంకరమైన మెసేజ్‌ వచ్చింది. సిద్ధార్థ్‌ మరణ వార్త తెలిసి అతనికి సంతాపంగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాను. దానికి ఓ నెటిజన్‌.. 'నువ్వు కూడా త్వరగా చచ్చిపో' అని మెసేజ్‌ చేశాడు. ఇది చూసి  భయంతో వణికిపోయి, 103 డిగ్రీల జ్వరంతో ఆసుపత్రిలో చేరాను అని పేర్కొంది.
చదవండి : కసరత్తు ఎక్కువైనా ప్రమాదమేనా..!

సిద్ధార్థ్‌ మరణం తనని ఎంతో ఎఫెక్ట్‌ చేసిందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే తాను  కోలుకుంటానని తెలిపింది. కాగా సిద్ధార్థ్‌కు సంతాపంగా పలువురు ప్రముఖులు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. నటి  జస్లీన్‌ సైతం సిద్ధార్థ్‌కు సంతాపంగా ఓ పోస్ట్‌ను షేర్‌ చేయగా, దానికి ఓ నెటిజన్‌  'నువ్వు కూడా త్వరగా చచ్చిపో' అని కామెంట్‌ చేశాడు. దీంతో 'ఒకరి చావు గురించి కూడా జోక్స్‌ ఎలా వేస్తారు?  ఇలా అనడానికి సిగ్గు లేదా?.. అందరూ చనిపోయిన తర్వాత ఒక్కరే ఉంటారా? ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడుతారు' అంటూ జస్లిన్‌ ఘాటుగా బదులిచ్చింది. 

A post shared by Jasleen Matharu ਜਸਲੀਨ ਮਠਾੜੂ (@jasleenmatharu)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు