‘సాక్షి’మీడియా గ్రూప్‌కు ధన్యవాదాలు: కే. విశ్వనాథ్‌

3 Feb, 2023 12:56 IST|Sakshi

అగ్ర దర్శకుడు, కళా తపస్వీ కే. విశ్వనాథ్‌ (92) ఇక లేరనే విషయం తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేసిన విశ్వానాథ్‌.. ఎన్నో రికార్డులను, అవార్డులను సొంతం చేసుకున్నారు. 2015లో ఆయనకు ‘సాక్షి’ మీడియా సంస్థ ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినే ‘సాక్షి ఎక్సలెన్స్  లైఫ్ టైం అచీవ్ మెంట్’ అవార్డును ప్రధానం చేసింది.

(చదవండి: కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్‌ ఇకలేరు)

సినీరంగంలో చేసిన అత్యుత్తమ సేవలను గుర్తించిన సాక్షి సంస్థ 2015 సంవత్సరానికిగానూ ఈ అవార్డును ఆయనకు ప్రధానం చేసింది. సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేతుల మీదుగా కళాతపస్వి విశ్వనాథ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తనను గుర్తుపెట్టుకుని మరీ గౌరవించిన సాక్షి సంస్థకు ధన్యావాదాలు తెలిపారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు